Begin typing your search above and press return to search.

మహేష్ 200% కష్టపడే హీరో.. ఎందుకంటే: త్రివిక్రమ్

మాస్ మసాలా మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:50 PM GMT
మహేష్ 200% కష్టపడే హీరో.. ఎందుకంటే: త్రివిక్రమ్
X

మాస్ మసాలా మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈవెంట్ ను గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ తన మాటలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈరోజు గుంటూరుకు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సినిమా పేరు గుంటూరు కారం. రమణ గాడు మీవాడు మనందరి వాడు సో అందుకనే మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలి అని వచ్చాము.

మహేష్ ఇక్కడికి విపరీతంగా అలసిపోయిన తర్వాత కూడా గుంటూరు ప్రజలను కలవడానికి వచ్చారు. అందుకనే అందరూ ఇక్కడ క్రమశిక్షణతో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక రెండో విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు మహామనిషి ఆయన తో నేరుగా పనిచేయలేకపోయినప్పటికీ ఆయన చేసిన ఒక సినిమాకు రైటర్ గా ఉన్న పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేశాను.

ఆయనతో డైరెక్ట్ గా పరిచయం ఏర్పడిన సందర్భాలు కొంత మాత్రమే. ఆ తర్వాత అతడు ఖలేజా సినిమాలు తీసిన తర్వాత ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడిన పది నిమిషాల సమయం కూడా నాకు చాలా అపూర్వమైనది. అలాంటి గొప్ప వ్యక్తికి పుట్టినటువంటి మహేష్ గారు ఎంత అదృష్టవంతులో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

క్రమశిక్షణతో ఒక సినిమాకు 100% కంటే ఎక్కువగా 200 శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ గారు మాత్రమే. ఇది చెప్పడంలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు వెనక్కి తిరిగి చూడరు. అలాగే అతడు సినిమాకు పనిచేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఖలేజా సినిమాకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో.. ఈరోజు కూడా అలానే ఉన్నారు. పాతిక సంవత్సరాలు అని అందరూ అనుకుంటున్నారు.. కానీ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఇచ్చిన హీరో లాగా అనిపిస్తూ ఉంటాడు.

చూడడానికి యంగ్ గా ఉన్నారు అలాగే పర్ఫామెన్స్ లో కూడా అంత నూతనంగా అంత యవ్వనంగా ఉన్నారు. ఆయనకు మరిన్ని వసంతాలు ఉండాలి అని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనుకలో ఉండాలి అని ఆయనను ఆశీర్వదించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 12వ తారీకున మీ థియేటర్లలో కలుద్దాం. ఈ సంక్రాంతిని గొప్పగా జరుపుకుందాం.. ఆనందంగా జరుపుకుందాం.. రమణ గారితో కలిసి జరుపుకుందాం.. అని త్రివిక్రమ్ గారు వివరణ ఇచ్చారు.