Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం'.. ఇది 10 రోజుల బాక్సాఫీస్ లెక్క

ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:37 AM GMT
గుంటూరు కారం.. ఇది 10 రోజుల బాక్సాఫీస్ లెక్క
X

టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి సినిమాకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందని కథనాలు వెలువడ్డాయి.

కానీ ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి విపరీతమైన క్రేజ్ ఉండడం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మిక్స్డ్ టాక్ తో అది కూడా ఓ రీజినల్ సినిమా వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కొల్లగొట్టడం అంటే అది మాములు విషయం కాదు. ఇప్పటిదాకా మరే హీరోకి ఇలాంటి ఫీట్ సాధ్యం కాలేదు ఇక ఇటీవలే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఇక 10 రోజుల్లో గుంటూరు కారం సినిమాకి వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే..

ఏపీ & నైజాం కలిపి - 173కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - 24కోట్లు

ఓవర్సీస్ - 34కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 231కోట్లు

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించారు.