Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' రన్ టైమ్.. తేడా ఏమిటంటే..

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు

By:  Tupaki Desk   |   8 Jan 2024 12:50 PM GMT
గుంటూరు కారం రన్ టైమ్.. తేడా ఏమిటంటే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఏకంగా 5 వేలకు పైగా థియేటర్స్ లో 'గుంటూరు కారం' రిలీజ్ కాబోతోంది.

జనవరి 11నే ఓవర్సీస్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి రన్ టైం వివరాలతో పాటూ తదితర అంశాలు బయటికి వచ్చాయి. దాని ప్రకారం గుంటూరు కారం 159 నిమిషాల రన్ టైం తో ఉంటుందట. అంటే 2 గంటల 39 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. అందులో ఫస్టాఫ్ లెంత్ వచ్చేసి 85 నిమిషాలు, సెకండాఫ్ లెంత్ వచ్చి 74 నిమిషాలుగా ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో అక్కడ ప్రీమియర్స్ మొదలు కాబోతుండడంతో ఓవర్సీస్ లో మరికొన్ని ప్రదేశాల్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ గుంటూరు కారం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ లో మహేష్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈసారి అంతకుమించేలా గుంటూరు కారం రిలీజ్ ను ప్లాన్ చేయడంతో కచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఈ మూవీ రూ .50 కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.