Begin typing your search above and press return to search.

గన్స్​ అండ్ గులాబ్స్​.. ఇక్కడ ఇలా.. అక్కడ అలా

గన్స్‌ అండ్‌ గులాబ్స్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సారి వారి ప్రయోగం కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 7:05 AM GMT
గన్స్​ అండ్ గులాబ్స్​.. ఇక్కడ ఇలా.. అక్కడ అలా
X

రాజ్‌ అండ్‌ డీకే.. ఓటీటీలో ఈ పేరు ఓ బ్రాండ్​. హిందీలో సత్తా చాటుతున్న ఈ తెలుగు దర్శకద్వయం.. పలువురు అగ్ర కథానాయకులతో సిరీస్​లు చేస్తూ తమకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికే సమంత-మనోజ్​ బాజ్​పేయ్​-ప్రియమణితో ఫ్యామిలీ మెన్​, విజయ్​ సేతుపతి-షాహిద్​ కపూర్​తో 'ఫర్జీ' సిరీస్​లు చేసి ఆకట్టుకున్నారు.

ఈ రెండు సిరీస్​లు ఓటీటీ ఆడియెన్స్​ను బాగా మెప్పించాయి. కాస్టింగ్​ ఛాయిసెస్​తోనే తమ సిరీస్​పై స్పెషల్ బజ్​ క్రియేట్​ చేసే ఈ దర్శకద్వయం.. ఈ సారి కూడా అలానే ఆకట్టుకున్నారు. రాజ్‌కుమార్‌రావు, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్​.. క్రైం, రొమాన్స్‌, వినోదం ప్రధానంగా గన్స్‌ అండ్‌ గులాబ్స్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సారి వారి ప్రయోగం కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తోంది.

ఈ సిరీస్​ మిక్స్​డ రివ్యూస్​ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సౌత్ ఆడియెన్స్ రివ్యూ​ విషయానికొస్తే.. ఈ సిరీస్ చూడటానికి పర్వాలేదంటూనే మిక్స్​డ్​ రివ్యూస్​ ఇస్తున్నారు. అయితే నార్త్​ ఆడియెన్స్ రివ్యూ​ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. బాగానే ఉందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గత సిరీస్​లతో పోలిస్తే.. రాజ్ అండ్ డీకే ఈ సారి మునపటి స్థాయిలో సక్సెస్​ను అందుకోలేదని తెలుస్తోంది.

ఈ సిరీస్​లో రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్​తో పాటు గుల్షన్‌ దేవయ్య, ఆదర్శ్‌ గౌరవ్‌, సతీష్‌ కౌశిక్‌, పూజా గోర్‌, శ్రేయా ధన్వంతరి, విపిన్‌ శర్మ తదితరులు నటించారు. అమన్‌ పంత్‌- సంగీతం, పంకజ్‌ కుమార్‌ -సినిమాటోగ్రఫీ అందించారు. సుమీత్‌ కొటియాన్‌ ఎడిటర్​గా వ్యవహరించారు. సుమిత్‌ అరోరా, సుమన్‌ కుమార్‌ రచన అందించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​ టాప్​-10లో లిస్ట్​లో నిలిచింది.

ఇకపోతే రాజ్ అండ్ డీకే దర్శకద్వయం తెరకెక్కించిన మరో సిరీస్​ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సిరీస్​ సిటాడెల్​ను ఇండియన్​ వెర్షన్​లో రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. అయితే హాలీవుడ్ వెర్షన్ డిజాస్టర్​ టాక్​తో​ బోల్తా కొట్టింది. మరి ఈ ఇండియన్​ సిరీస్​ను రాజ్ డీకే ఎలా తెరకెక్కించారో చూడాలి. ఏదేమైనప్పటీకి ఈ సిరిస్​పై మంచి అంచనాలే ఉన్నాయి.