గుణశేఖర్ మళ్లీ యూత్ ని టార్గెట్ చేసాడా?
`నిప్పు` తర్వాత గుణశేఖర్ సినిమా ఫార్మెట్ మార్చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో గొప్ప చిత్రాలు చేయాలని సంకల్పించి ముందుకు కదిలాడు.
By: Tupaki Desk | 26 May 2025 12:53 PM IST'నిప్పు' తర్వాత గుణశేఖర్ సినిమా ఫార్మెట్ మార్చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో గొప్ప చిత్రాలు చేయాలని సంకల్పించి ముందుకు కదిలాడు. తొలి ప్రయత్నం `రుద్రమదేవి` మంచి ఫలితాన్నే అందిం చింది. చారిత్రాత్మక నేపథ్యం గల కథలు కూడా గుణ డీల్ చేయగలడని `రుద్రమదేవి`తో ప్రూవ్ అయింది. కానీ ఎందుకనో ఆ సక్సెస్ ని కంటున్యూ చేయలేకపోయాడు. `రుద్రమదేవి` తర్వాత మరో సినిమా చేయ డానికి ఏకంగా ఎనిమిదేళ్లు సమయం పట్టింది.
అదే 'శాకుంతలం'. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రివకరీ చేయలేకపోయింది. భారీగా నష్టాలొచ్చాయి. ఈ రెండు సినిమాల మద్యలో `హిరణ్యకశిప` అనే ప్రాజెక్ట్ ప్లాన్ చేసాడు. కానీ వివాదాల కారణంగా అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా గుణశేఖర్ మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ ఆరంభం గుణ శేఖర్ ని మళ్లీ సీన్ లోకి తెచ్చినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆయన స్వీయా దర్శకత్వంలో 'యూఫోరియా' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూత్ టార్గెట్ గా చేసిన చిత్రంగా రివీల్ చేసారు. యువతరం మెచ్చే ఆసక్తికర కథ, కథనాలతో వస్తు న్నట్లు ప్రకటించారు. యూత్ టార్గెట్ చిత్రమైనా తన మార్క్ చిత్రమని అన్నారు. తన నుంచి రొటీన్ కు భిన్నమైన సినిమాలు మాత్రమే వస్తాయన్నారు. ఈ సందర్భంగా `చూడాలని ఉంది`, `రామాయణం`, `ఒక్కడు` చిత్రాలను గుర్తు చేసారు.
`యూఫోరియా` కూడా అలాంటి కథాంశమే అంటున్నారు. మొత్తానికి గుణసార్ మళ్లీ పాత పద్దతిలో కమ ర్శియల్ ఫార్మెట్ లో సినిమాలు తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఆయన నుంచి ఇలాంటి టర్నింగ్ ఊహించనిదే . టాలీవుడ్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న వేళ గణశేఖర్ ఇలా యూటర్న్ తీసుకుంటాడని ఊహించలేదు.
