Begin typing your search above and press return to search.

'గూఢ‌చారి 2' గేమ్ ఛేంజింగ్ ఫిల్మ్.. శేష్ ప్ర‌క‌ట‌న వెన‌క‌!

ప్రేక్ష‌కాభిమానుల ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు చెబుతూనే జి2 పై అప్ డేట్ అందించారు.

By:  Tupaki Desk   |   22 July 2023 4:36 AM GMT
గూఢ‌చారి 2 గేమ్ ఛేంజింగ్ ఫిల్మ్.. శేష్ ప్ర‌క‌ట‌న వెన‌క‌!
X

'గూఢ‌చారి' చిత్రంతో సైలెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన అడివి శేష్‌.. ఆ త‌ర్వాత క్ష‌ణం- మేజ‌ర్-హిట్ 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో త‌నదైన‌ దూకుడును కొన‌సాగించాడు. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస విజ‌యాల‌తో ఒక్కో మెట్టు పైకి ఎక్కాడు. 'మేజ‌ర్' చిత్రంతో అత్యంత కీల‌క‌మైన‌ పాన్ ఇండియా మార్కెట్ ని ఛేజిక్కించుకున్నాడు.

ఇప్పుడు అడివి శేష్ ఎవ‌రో హిందీ ఆడియెన్ కి చాలా స్ప‌ష్ఠంగా తెలుసు. ప్ర‌భాస్- బ‌న్ని- చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ త‌ర‌హాలోనే అడివి శేష్ ప్ర‌తిభ గురించి ఉత్త‌రాది మీడియాలోను విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.

నేటిత‌రంలో స‌త్తా ఉన్న హీరోగా.. ర‌చ‌యిత కం ద‌ర్శ‌కుడిగా అడివి శేష్ మ‌ల్టీట్యాలెంట్ పై నిర్మాత‌ల‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంది. ప్రస్తుతం శేష్ తన పాత్ బ్రేకింగ్ చిత్రం గూఢచారికి సీక్వెల్ అయిన పాన్ ఇండియా చిత్రం G2 లో నటిస్తున్నాడు.

ఈ చిత్రంతో శేష్ పాన్ ఇండియా ఫిల్మ్ మేజర్ ఎడిటర్లలో ఒకరైన వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ చాలా కాలంగా పెండింగ్ లో ఉండ‌డంతో ప్ర‌స్తుతానికి నిలిపివేశార‌ని ఇటీవ‌ల పుకార్లు షికార్ చేసాయి. కానీ ఇప్పుడు అన్ని పుకార్ల‌కు చెక్ పెడుతూ శేష్ దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని ప్ర‌క‌టించారు. అంతేకాదు 'గూఢ‌చారి 2' గేమ్ ఛేంజింగ్ ఫిల్మ్ అవుతుంద‌ని పేర్కొన్నాడు. ప్రేక్ష‌కాభిమానుల ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు చెబుతూనే జి2 పై అప్ డేట్ అందించారు.

''మీ ప్రేమకు ధన్యవాదాలు.. దర్శకుడు విన‌య్ కుమార్ - అబ్బూరి ర‌వి(ర‌చ‌యిత‌) సర్ తో కలిసి గత ఆరు నెలలుగా గేమ్ ను మార్చే సినిమాని అందించడానికి రాస్తున్నాను. #G2 స్క్రిప్ట్ ఒక భారీ విజన్. భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.

దర్శకుడు విన‌య్ విజ‌న్ నన్ను కొన్నిసార్లు భయపెడుతుంది కానీ నేను చెప్పబోయేది ఒక్కటే.. ఇంకా.. చాలా ల‌వ్‌'' అని శేష్ ల‌వ్ ఈమోజీని షేర్ చేసారు. క‌థ ప‌రంగా థ్రిల్స్ ప‌రంగా అలాగే బ‌డ్జెట్ల ప‌రంగా గూఢ‌చారి 2 అతి భారీగా ఉంటుంద‌న్న సంకేతం శేష్ అభిమానుల్లోకి పంపాడు.