Begin typing your search above and press return to search.

గూఢచారి 2.. రంగంలోకి టాలెంటెడ్ హీరోయిన్

అడివి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో గూఢచారి ఒకటి. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 7:17 AM GMT
గూఢచారి 2.. రంగంలోకి టాలెంటెడ్ హీరోయిన్
X

అడివి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో గూఢచారి ఒకటి. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇక మొత్తానికి G2 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో ఇప్పుడు మళ్లీ హైప్ పెంచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌పై అంచనాలు పెరిగిపోగా, ఈ చిత్రంలో కథానాయికను కూడా ప్రకటించారు. గూడాచారి జి2లో శేష్ సరసన బనితా సంధు కనిపించనుందనే వార్తను మేకర్స్ అఫీషియల్ గా తెలియజేశారు.

G2 అనేది మేజర్, కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ 2 నిర్మాతల నుండి రాబోతోంది. ఇది ఒక ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. ఇక సినిమా కోసం టాలెంటెడ్ నటీనటులను మేకర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్టోబర్, సర్దార్ ఉదం వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బనిత. ఆమె పంజాబీ భాషలో కూడా నటించింది.


అలాగే ఇంగ్లీష్ సినిమాలు చేసిన అనుభవం ఉంది. నటిగా పలు విభిన్నమైన పాత్రలు చేసిన అమ్మడు ఇప్పుడు గూఢచారి 2లో అవకాశం ఆదుకోవడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఆమెకు ఛాన్స్ రావడంతో తన సంతోషాన్ని షేర్ చేసికుంది. బనిత మాట్లాడుతూ.. ఇది నా మొదటి పాన్-ఇండియా చిత్రం. ఇటువంటి అద్భుతమైన టీమ్‌తో వర్క్ చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

నేను ఇంతకు ముందు చేయనంత భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. నేను వేచి ఉండలేను. ప్రేక్షకులు నన్ను పూర్తిగా ఫ్రెష్ అవతార్‌లో చూస్తారని నమ్మకంతో ఉన్నాను. అలాగే ఈ సినిమాలో పని చేయడం ద్వారా ఇంకా మరింత అనుభవం అందుకుంటాను అనిపిస్తోంది.. అని ఆమె వివరణ ఇచ్చారు.

ఇక అడివి శేష్ మాట్లాడుతూ, "నేను G2 ప్రపంచానికి బనితాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను, నేను ఆమె సహకారం కోసం ఎదురు చూస్తున్నాను.. అని తెలియజేశారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అడివి శేష్ ఏ రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.