పహల్గాం ఘటన.. ఆ మూవీ హాట్ టాపిక్!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు పాశవిక దాడి జరిపి 26 మంది అమాయక ప్రజలు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2025 8:14 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు పాశవిక దాడి జరిపి 26 మంది అమాయక ప్రజలు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో నిజ జీవిత ఘటనల ఆధారంగా కాశ్మీర్ నేపథ్యంతో రూపొందిన గ్రౌండ్ జీరో మూవీ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోగా తేజస్ విజయ్ డియోస్కర్ దర్శకత్వంలో గ్రౌండ్ జీరో మూవీ తెరకెక్కింది. బీఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దూబే జీవితం ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ పోషించారు. రాణా తాహిర్ నదీమ్ ను ధైర్యంగా ఎదుర్కొనే ఆఫీసర్ గా కనిపించారు.
అయితే గ్రౌండ్ జీరో మూవీ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల జరగడం వల్ల మూవీ హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు దేశభక్తితో ఉప్పొంగిపోతున్నారట. ఆ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో రివ్యూస్ రూపంలో ఇస్తున్నారు మూవీ లవర్స్.
నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాను చాలా బాగా తీశారని అనేక మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ అదరగొట్టేశారని చెబుతున్నారు. తన అద్భుతమైన యాక్టింగ్ తో మెప్పించారని అంటున్నారు. ఇండియన్స్ తప్పక చూడాలని కామెంట్లు పెడుతున్నారు.
గ్రౌండ్ జీరో మూవీలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అలరించడం ప్రారంభమవుతుందని సినీ ప్రియులు చెబుతున్నారు. అదే సమయంలో మూవీ స్క్రీన్ ప్లే విషయంలో కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. అందుకే కొన్ని దగ్గర డిస్టర్బ్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. ఎడిటింగ్ లో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.
మూవీకి ఒక మైనస్ మ్యూజిక్ అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు తగ్గట్టుగా లేదని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో సౌండ్ మరీ ఎక్కువగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా దేశ భక్తి భావన మాత్రం ఉట్టిపడుతుందని అంటున్నారు. మొత్తానికి సినిమా మస్ట్ వాచ్ అని కామెంట్లు పెడుతున్నారు.
