Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో టైటిల్ 'గ్రేటెస్ట్ వ‌న్ అక్రాస్ టైమ్స్'!

మ‌రి ఆస్టార్ హీరో టైటిల్ 'గ్రేటెస్ట్ వ‌న్ అక్రాస్ టైమ్స్' ఇదేంటి? వింత‌గా ఉంది అనుకోవ‌డంలో త‌ప్పు లేదు

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:08 AM GMT
ఆ స్టార్ హీరో టైటిల్ గ్రేటెస్ట్ వ‌న్ అక్రాస్ టైమ్స్!
X

తెలుగు సినిమాకి..త‌మిళ సినిమాకి ఇంగ్లీష్ టైటిల్స్ అనేవి పెద్ద‌గా క‌నిపించ‌వు. చాలా రేర్ గానే స్టోరీ డిమాండ్ చేస్తే త‌ప్ప అలాంటి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్ట‌రు. ఎందుకంటే ఇక్క‌డ జ‌నాల‌కి ఇంగ్లీష్ టైటిల్స్ క‌నెక్ట్ కావు కాబ‌ట్టి...వీలైనంత వ‌ర‌కూ క్యాచీగా ఉండే మాస్ టైటిల్స్ వైపై మొగ్గు చూపుతున్నారు. తొలుత సినిమా టైటిల్ తోనే జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లాలి అన్న‌ది మ‌న తెలుగు..త‌మిళ మేక‌ర్స్ ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టే స్టార్ హీరోల టైటిల్స్ నిర్దారిస్తుంటారు.

మ‌రి ఆస్టార్ హీరో టైటిల్ 'గ్రేటెస్ట్ వ‌న్ అక్రాస్ టైమ్స్' ఇదేంటి? వింత‌గా ఉంది అనుకోవ‌డంలో త‌ప్పు లేదు. నిజ‌మే ఈ టైటిల్ నిజంగానే వింత‌గా అనిపించ‌డం స‌హ‌జమే. మ‌రి ఈ టైటిల్ పెట్టుకుంటోన్న హీరో ఎవ‌రు? ద‌ర్శ‌కుడు ఏ చిత్రానికి ఆటైటిల్ నిర్ణ‌యించే ప్లాన్ లో ఉన్నాడు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం త‌ల‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా ఆయ‌న 68వ చిత్రాన్ని వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకి 'గోట్' అనే టైటిల్ నిఖ‌రారు చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. గోట్ అంటే?... 'గ్రేటెస్ట్ వ‌న్ అక్రాస్ టైమ్స్' అన్న‌ది టైటిల్ యోక్క పూర్తి అర్దం అన్న మాట‌. మొత్తం ఒకేసారి పల‌క‌డం క‌ష్టం కాబ‌ట్టి సింపుల్ గా గోట్ గా షార్ట్ క‌ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కు ముందు 'ప‌జిల్' అనే మ‌రో టైటిల్ కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ ఆ టైటిల్ ని టీమ్ కొట్టిపారేసింది. తాజా టైటిల్ మ్యాట‌ర్ మాత్రం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

దీనిపై యూనిట్ ఇంకా స్పందించ‌లేదు. అధికారికంగా ఈ టైటిల్ పై క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని పాన్ ఇండియాలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లిష్ టైటిల్ అయితే బాగుటుంద‌ని యూనిట్ మొద‌టి నుంచి భావిస్తోందిట‌. అందుకే ఇలాంటి టైటిల్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. వివిధ భాష‌ల్లో వేరే వేరు టైటిల్స్ పెట్ట‌డం క‌న్నా...ఒకే టైటిల్ తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం అన్న‌ది ఈజీగా ఉంటుంద‌ని ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.