Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఆన్‌ లొకేషన్‌ పిక్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ ఈ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది అన్నట్లుగా రష్మిక మందన్నా పేర్కొంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 11:02 AM GMT
పుష్ప 2 ఆన్‌ లొకేషన్‌ పిక్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌
X

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి.


పుష్ప 2 సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో పుష్ప 2 సినిమా షూటింగ్‌ జరుగుతున్న భవనంకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోను స్వయంగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సుకుమార్‌ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నాడు. ఇలాంటి సమయంలో రష్మిక మందన్నా సోషల్ మీడియా ద్వారా ఈ పిక్ ని లీక్ చేయడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ ఈ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది అన్నట్లుగా రష్మిక మందన్నా పేర్కొంది.

పుష్ప 2 అంటూ లవ్ ఈమోజీని షేర్ చేసిన రష్మిక మందన్నా ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుంది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా పుష్ప 2 సినిమా తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంటి సెట్‌ తో పాటు ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ ఫోటోను కూడా లీక్ చేయొచ్చు కదా రష్మికా అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుకుమార్‌ నుండి పుష్ప 2 అప్డేట్ మరియు టీజర్ పై ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా వెయిట్‌ చేస్తున్నారు. పుష్ప 2 విడుదల విషయం లో సుకుమార్‌ క్లారిటీ ఎప్పుడెప్పుడు ఇస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.