Begin typing your search above and press return to search.

జెర్సీ డైరెక్టర్ మరో 'మ్యాజిక్'

అయితే ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ చిన్న బడ్జెట్ మూవీని తెరకెక్కించాడు

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:12 AM GMT
జెర్సీ డైరెక్టర్ మరో మ్యాజిక్
X

మళ్ళీరావా, జెర్సీ,సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ మూవీని విజయ్ దేవరకొండతో చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. VD12 గా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే రౌడీ స్టార్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ కారణంగా గౌతమ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది.


అయితే ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ చిన్న బడ్జెట్ మూవీని తెరకెక్కించాడు. కొత్తవాళ్లతో టీనేజ్ కథతో సినిమాని కంప్లీట్ చేశాడు. మ్యాజిక్ అనే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని తాజాగా ఆవిష్కరించారు. అందులో ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు, ఒక టీనేజ్ అమ్మాయి ఉన్నారు. దీనిని బట్టి వారి నలుగురు కథగా మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.

మ్యూజికల్ యూత్ ఫుల్ స్టోరీతో ఈ మూవీని గౌతమ్ చేసాడంట. కాలేజీ ఫెస్ట్ కోసం ఓ సాంగ్ చేయాలని అనుకునే గ్యాంగ్ స్టోరీగా మ్యాజిక్ మూవీ ఉండబోతోందంట. కొత్తవాళ్లతో చేసిన కూడా ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా స్టార్స్ కావడం విశేషం. సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఇలాంటి యూత్ ఫుల్ మూవీస్ కి అనిరుద్ సంగీతం అంటే అది కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంచనా వేయొచ్చు.

అలాగే గిరీష్ గంగాధరన్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ కాగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. త్వరలో మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో కచ్చితంగా మూవీ టైటిల్ కి తగ్గట్లుగానే మ్యాజిక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండతో చేయాల్సిన పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో ఈ వేసవి సీజన్ లోనే మ్యాజిక్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.