Begin typing your search above and press return to search.

శ్రీను వైట్ల - గోపిచంద్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..

హీరో గోపీచంద్‌ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 12:21 PM GMT
శ్రీను వైట్ల - గోపిచంద్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..
X

హీరో గోపీచంద్‌ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో మొదటి చిత్రమిది. రీసెంట్​గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే నేడు దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా మూవీటీమ్​ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. హీరో గోపిచంద్​ కూడా దాన్ని పోస్ట్ చేశారు.

ఈ సినిమా షూటింగ్‌ సౌత్​ ఇటలీలోని మాంటెరాలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ఈ వీడియో ద్వారా తెలిపారు. ఈ గ్లింప్స్​లో మాంటెరాలోని అమేజింగ్ లొకేషన్స్​ను చూపించారు. అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. హై ఓల్టేజ్​ యాక్షన్ సీన్స్​ను రేపటి నుంచి ఇక్కడ చిత్రీకరించనున్నారట.

ఈ సినిమాను భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారని తెలిసింది. చిత్రలయం స్టూడియోస్​ బ్యానర్​లో ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్​, హై టెక్నికల్ స్టాండర్డ్స్​తో నిర్మిస్తున్నారు. వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తం సినిమా షూటింగ్​ వివిధ దేశాల్లోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారట. డిఫరెంట్​ కాన్సెప్ట్​తో సినిమాను తీర్చిదిద్దనున్నారని తెలిసింది.

ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించనున్నారు. గతంలో శ్రీను వైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలను కూడా అందించారు. గోపీచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా ఆయన పని చేశారు.

'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు ఇతర సినిమాలకు పని చేసిన మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్ ఈ గోపిచంద్-శ్రీనువైట్ల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకోనున్నారు. చూడాలి మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్​ - శ్రీనువైట్ల ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నారో, ఈ సినిమా వీరిద్దరికి ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో...