Begin typing your search above and press return to search.

గోపిచంద్ తో ఈసారి కామెడీ దర్శకుడు.. టైటిల్ కూడా రెడీ

టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో గోపీచంద్

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:46 AM GMT
గోపిచంద్ తో ఈసారి కామెడీ దర్శకుడు.. టైటిల్ కూడా రెడీ
X

టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో గోపీచంద్. గత కొన్నేళ్లుగా గట్టి హిట్ కోసం పరితపిస్తున్నే ఉన్నారు. రీసెంట్ గా 'రామబాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మళ్లీ నిరాశనే ఎదుర్కొన్నారు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే తపన తో కన్నడ డైరెక్టర్ తో 'భీమ' అనే పవర్ ఫుల్ సినిమా చేస్తున్నారు.

దీని తర్వాత ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న శ్రీనువైట్లతో సినిమా చేయనున్నారని తెలిసింది. అయితే ఇప్పుడీ సినిమా దాదాపుగా కన్ఫామ్ అయినట్లు సమాచారం అందింది. ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట.. దీనిపై ఇటీవలే శ్రీనువైట్ల-గోపిచంద్ కూడా కలిసి మాట్లాడుకున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. టైటిల్ కూడా ఫిక్స్ అయిందట. 'విశ్వమ్' అనే పేరును ఖరారు చేశారని సమాచారం అందింది. కామిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్.

ఇకపోతే గోపిచంద్ లానే శ్రీనువైట్ల కూడా చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. కామెడీకి కమర్షియ ల్ టచ్ ఇచ్చి ఎన్నో బ్లాక్ బాస్టర్లు అందుకున్నారు. 'ఢీ', 'రెడీ', 'దూకుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. 'ఆగడు', 'మిస్టర్‌', 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' వంటి చిత్రాలతో వరుస పరాజయాలు అందుకున్నారు.

ఈ వరుస పరాజయాలతో శ్రీనువైట్లతో సినిమాలు చేసేందుకు హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. అయినా ఆ మధ్యలో మంచు విష్ణుతో 'ఢీ' సీక్వెల్‌ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ ప్రాజెక్ట్ అడ్రెస్ట్ లేకుండా పోయింది. ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు గోపిచంద్ తో ఆయన సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ కాంబో ఎలాంటి కథతో వస్తారో? హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తిరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..