Begin typing your search above and press return to search.

ఆ కాంబినేష‌న్ లో సినిమా..ఒక‌రికోక‌రు!

మ్యాచో స్టార్ గోపీచంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతుంది. 'ఆర‌డుగుల బెల్లెట్'..'ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్' లాంటి సినిమాలు యావ‌రేజ్ గా ఆడాయి

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:10 AM GMT
ఆ కాంబినేష‌న్ లో సినిమా..ఒక‌రికోక‌రు!
X

మ్యాచో స్టార్ గోపీచంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతుంది. `ఆర‌డుగుల బెల్లెట్`..`ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` లాంటి సినిమాలు యావ‌రేజ్ గా ఆడాయి త‌ప్ప‌! గోపీచంద్ రేంజ్ కి త‌గ్గ విజ‌యాలు కావు అవి. అంత‌కు ముందు న‌టించిన సినిమాల ప‌రిస్థితి అదే. . డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. చివ‌రికి త‌మిళ డైరెక్ట‌ర్ తిరుతో కూడా` చాణ‌క్య` లాంటి సినిమా చేసారు. అదీ నిల‌బ‌డ‌లేదు.

ఆ ర‌కంగా గోపీచంద్ కి మూడు నాలుగేళ్ల‌గా స‌రైన విజ‌యాలైతే లేవు. దీంతో గోపీచంద్ మార్కెట్ పైనా కొంత ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా శ్రీనువైట్ల‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ప్రారంభ‌మైంది. ఇక శ్రీనువైట్ల అప‌జ‌యాల ప‌ర‌పర గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మంచి అవ‌కాశాల‌న్ని చేజార్చుకున్నారు. న‌మ్మి అవ‌కాశం ఇస్తే రొటీన్ సినిమాలు తీసి విమ‌ర్శ‌ల పాల‌య్యారు.

వ‌రుస‌గా నాలుగు ప్లాప్ సినిమాలతో ఐదేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో క‌న‌బ‌డ‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడు గోపీంచంద్ సినిమా ప్రారంభంతోనే ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇది శ్రీనువైట్ల‌కి మ‌రో గొప్ప అవ‌కాశంగా చెప్పాలి. స‌రైన క‌థ‌తో సినిమా తీసి హిట్ కొడితే ఫాంలో కి రావొచ్చు. మిగ‌తా హీరోలు సీనియర్ కి అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. ఇది ఆయ‌న కెరీర్ కి కూడా చాలా ముఖ్య‌మైన విజ‌యంగా చెప్పాలి.

ఇక గోపీ వైపు నుంచి చూస్తే ఆయ‌నా బ్యాడ్ ఫేజ్ లో నే క‌నిపిస్తున్నాడు. కొత్త వాళ్ల‌తో రిస్క్ తీసుకులేక‌.. .చేసిన వాళ్ల‌తో మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేక..క‌థ‌ల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో తొంద‌గ‌రా ఏ క‌థ‌కి క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీను వైట్ల ఆయ‌న‌కు తార‌స‌ప‌డ‌టం..ప్రాజెక్ట్ ఒకే అవ్వ‌డం స‌ర్ ప్రైజింగ్ అంశ‌మే. వైట్ల గ‌త స‌క్సెస్ లు చూసి గోపీచంద్ అవ‌కాశం ఇచ్చారా? లేక త‌న‌కి స‌రైన క‌మ‌ర్శియ‌ల్ హిట్ ఇవ్వ‌గ‌ల‌డ‌ని న‌మ్మి ఛాన్స్ ఇచ్చార‌? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ..ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు ఒక‌రికొక‌రు స‌హ‌కారం చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఈ జోడీ మంచి విజ‌యంతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ఆశిద్దాం.