Begin typing your search above and press return to search.

మొహమాటాల్లేవ్ అంటున్న మ్యాచో స్టార్..!

అదే ఇంటర్వ్యూలో తను మొహమాటానికి పోయి సినిమాలు చేయడం వల్ల కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు మొహమాటాలకు పోవడం లేదని.

By:  Tupaki Desk   |   7 March 2024 1:09 PM GMT
మొహమాటాల్లేవ్ అంటున్న మ్యాచో స్టార్..!
X

మ్యాచో హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్ట్ చేసిన సినిమా భీమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు గోపీచంద్. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు గోపీచంద్.

తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో జయం సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన జయం సినిమా గోపీచంద్ కి విలన్ గా మంచి బ్రేక్ ఇచ్చింది. జయం తర్వాత నిజం ఇలా వరుసగా రెండు సినిమాల్లో తేజ ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ యజ్ఞం తో హీరోగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్.

కెరీర్ లో పడుతూ లేస్తూ వస్తున్న మ్యాచో హీరో కొద్దిపాటి గ్యాప్ తర్వాత తన మార్క్ మాస్ మూవీతో భీమా అంటూ వస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో తను మొహమాటానికి పోయి సినిమాలు చేయడం వల్ల కెరీర్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు మొహమాటాలకు పోవడం లేదని. సినిమా కథ నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తున్నానని అన్నారు గోపీచంద్. సినిమాలు బాగున్నా కూడా సరిగా ఆడలేదంటూ సాహసం, ఒక్కడున్నాడు సినిమాల గురించి చెప్పుకొచ్చారు గోపీచంద్.

ఒక్కడున్నాడు సినిమా ఇప్పుడు వస్తే కచ్చితంగా రిజల్ట్ బాగుండేదని అన్నారు గోపీచంద్. ఇక తనకు విలన్ గా రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తేజతో సినిమా చేసే అవకాశం వచ్చినా కాదన్నానని చెప్పారు. గోపీచంద్ హీరోగా కొత్త హీరోయిన్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారట తేజ. అయితే తన పక్కన కొత్త హీరోయిన్ కష్టమని.. పేరున్న హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పాడట. అయితే ఆ సినిమా చర్చల దశలోనే ఆగిపోయిందని చెప్పారు.

భీమా సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఉందని. సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు గోపీచంద్. భీమా సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్స్ గా నటించారు.