Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ గురించి.. మళ్లీ అదే మాట చెప్పిన గోపీచంద్‌

ఆ విషయం పక్కన పెడితే గోపీచంద్‌ ఏ ఇంటర్వ్యూలో అయినా ప్రభాస్ కు సంబంధించిన ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటాడు.

By:  Tupaki Desk   |   2 March 2024 5:11 AM GMT
ప్రభాస్‌ గురించి.. మళ్లీ అదే మాట చెప్పిన గోపీచంద్‌
X

యాక్షన్ హీరో గోపీచంద్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 8న భీమా సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్న గోపీచంద్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్‌ ను కొత్తగా చూడబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

గోపీచంద్ కి పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కెరీర్‌ ఆరంభం నుంచే చాలా సాన్నిహిత్యంతో, ఆప్త మిత్రులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ స్నేహంతో గోపీచంద్‌ కెరీర్‌ లో ప్రభాస్ ఎంతో హెల్ఫ్‌ చేశాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఆ విషయం పక్కన పెడితే గోపీచంద్‌ ఏ ఇంటర్వ్యూలో అయినా ప్రభాస్ కు సంబంధించిన ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనను మీడియా వారు ప్రభాస్ గురించి ఏదో ఒకటి ప్రశ్నిస్తూనే ఉంటారు. తాజాగా భీమా సినిమా ప్రమోషన్ లో కూడా మరోసారి ప్రభాస్ గురించి గోపీచంద్‌ స్పందించాడు.

ప్రభాస్ గురించి గోపీచంద్‌ మాట్లాడుతూ.. నాకు ఆప్త మిత్రుడు, కచ్చితంగా మరోసారి ప్రభాస్ తో కలిసి నటిస్తాను. అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేను అన్నట్లుగా గతంలో చెప్పిన మాటలనే గోపీచంద్‌ మరోసారి నొక్కి మరీ చెప్పాడు. సోషల్ మీడియాలో మళ్లీ గోపీచంద్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాడు.

ఈ మధ్య కాలంలో గోపీచంద్‌ హీరోగా హిట్‌ కొట్టలేక పోతున్నాడు. కనుక క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్‌ గా ప్రభాస్ సినిమాలో గోపీచంద్‌ ను రాబోయే కాలంలో చూస్తామని చాలా మంది సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది చివర్లో సలార్‌ తో వచ్చిన ప్రభాస్‌ ఈ ఏడాది లో ప్రాజెక్ట్‌ కే తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్‌ సినిమా కూడా మంచి అంచనాలతో రాబోతుంది. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగతో స్పిరిట్‌ మరియు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.