Begin typing your search above and press return to search.

గోపిచంద్ లైన్ లో దెబ్బతిన్న డైరెక్టర్!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా

By:  Tupaki Desk   |   6 April 2024 5:30 PM GMT
గోపిచంద్ లైన్ లో దెబ్బతిన్న డైరెక్టర్!
X

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇటీవల భీమా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. కానీ వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. ఇప్పుడు తన ఆశలన్నీ శ్రీను వైట్లతో చేస్తున్న సినిమాపైనే పెట్టుకున్నారు. గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. గోపీచంద్ ను ఇంత వరకూ ఎన్నడూ చూడని అవతార్ లో శ్రీను వైట్ల చూపించబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో సినిమా వస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు గోపీచంద్ నెక్స్ట్ మూవీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జిల్ మూవీ కాంబో రిపీట్ అవ్వనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 2015లో విడుదలైన జిల్ సినిమాకు డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహించగా.. డీసెంట్ హిట్ అయింది. ఇప్పుడు ఆయనతోనే గోపీచంద్ నెక్స్ట్ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే ఈ మూవీ స్టోరీ లైన్‌ ను గోపీ చంద్‌ కు వినిపించ‌గా ఆయన ఓకే చేసిన‌ట్లు టాక్.

త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ ను గోపీ చంద్ కు నెరేట్ చేయనున్నారట రాధాకృష్ణ. అంతా కుదిరితే ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే గోపీచంద్ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో సాహసం చేస్తున్నారని సినీ ప్రియులు అంటున్నారు. ఎందుకంటే రాధాకృష్ణ చివరి మూవీ రాధేశ్వామ్ డిజాస్టర్ అయింది.

ప్రభాస్ నటించిన ఈ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచారు రాధాకృష్ణ. కొన్ని సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా ఎవరికీ పెద్దగా నచ్చలేదు. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ తర్వాత కొత్త చిత్రం ప్రకటించని రాధాకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. అయితే గోపీ చంద్ మూవీతోనే డైరెక్టర్ గా మారిన రాధాకృష్ణ.. ఈ సినిమాతోనైనా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొడతారో లేదో చూడాలి.