Begin typing your search above and press return to search.

క్రాక్ డైరెక్టర్ కి హీరో కష్టాలు..!

క్రాక్, వీర సింహా రెడ్డి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి హీరో కష్టాలు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   29 Nov 2023 3:15 AM GMT
క్రాక్ డైరెక్టర్ కి హీరో కష్టాలు..!
X

క్రాక్, వీర సింహా రెడ్డి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి హీరో కష్టాలు మొదలయ్యాయి. అదేంటి వీర సింహా రెడ్డి తర్వాత రవితేజతో ఒక సినిమా అనుకున్నారు కదా అంటే. ఆ సినిమా ఎందుకో సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. బడ్జెట్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. రవితేజ గోపీచంద్ మరో క్రాక్ చూపిస్తారని అనుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.

రవితేజకు బదులుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో గోపీచంద్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ దాని గురించి క్లారిటీ రాలేదు. మిగతా స్టార్స్ తో గోపీచంద్ సినిమా చేద్దాం అనుకుంటే అందరు హీరోలు చేస్తున్న సినిమా గాక రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. ఒక్కసారి హీరో డైరెక్టర్ కాంబో మిస్ అయితే మళ్లీ ఆ డైరెక్టర్ కి సినిమా దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. స్టార్ హీరోలు ఎవరు దొరక్కపోతే యువ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తుంది.

వాళ్లు రాసుకున్న స్టార్ ఇమేజ్ ఉన్న కథలకు యంగ్ హీరోలు న్యాయం చేయలేక సినిమా ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. రవితేజ సినిమా ఆగిపోగా అజిత్ సినిమా కోసం గోపీచంద్ మలినేని వెయిట్ చేస్తున్నాడు అతను కూడా కుదరకపోతే మాత్రం గోపీచంద్ కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. కాదని యువ హీరోలతో చేస్తే మళ్లీ అతను యంగ్ హీరోల దర్శకుడిగానే ఉండిపోతాడు. రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్ ఇలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటాడని ఎవరు ఊహించలేదు.

బాలయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్న గోపీచంద్ ఈలోగా రవితేజ ఆఫర్ రాగానే ఇటు వచ్చాడు. చిరు కూడా వశిష్టతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు. అతనికి ఏ హీరో తన డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. రెండు హిట్లతో స్టార్ డైరెక్టర్ క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా కూడా మాస్ పంథాలోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే హీరో మారిన అదే కథతో తర్వాత సినిమా చేస్తాడా లేదా కథ కూడా వేరేది రాసుకుంటాడా అన్నది చూడాలి. హిట్ ఫాం లో ఉన్నాడు కాబట్టి గోపీచంద్ ఏ హీరోతో చేస్తే అతను వెరీ లక్కీ అని చెప్పొచ్చు.