Begin typing your search above and press return to search.

మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్?

గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ తరువాత ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీ చేశాడు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:50 AM GMT
మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్?
X

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్ మూవీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయిన కాని తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడంతో దర్శక, నిర్మాతలు గోపీచంద్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెమ్యునరేషన్ పరంగా కూడా అందుబాటులో ఉండటంతో గోపీచంద్ పైన నిర్మాతలు పెట్టుబడులు పెడతారు. అయితే గోపీచంద్ ఎక్కువగా ఫ్లాప్ దర్శకులకి అవకాశాలు ఇస్తూ ఉంటాడనేది టాలీవుడ్ లో వినిపించే మాట.

చాలా కాలం నుంచి అవకాశాలు లేని శ్రీవాస్ తో రీసెంట్ గా రామబాణం అనే సినిమా గోపీచంద్ చేశాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక స్టార్ డైరెక్టర్ గా ఫేం తెచ్చుకొని వరుస డిజాస్టర్ చిత్రాలతో ఫేడ్ అవుట్ అయిన శ్రీను వైట్లతో రీసెంట్ గా తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది ఢీ సీక్వెల్ చేయాలని శ్రీను వైట్ల ముందు ప్లాన్ చేసుకున్నారు.

అయితే విష్ణుకి స్టోరీ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. దీంతో గోపీచంద్ కి ఓ కథ చెప్పి ఒప్పించి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు మరో ఫ్లాప్ దర్శకుడికి కూడా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ తరువాత ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీ చేశాడు.

ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రస్తుతం అతను ఖాళీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ సపోర్ట్ ఉండటంతో యూవీ క్రియేషన్స్ లోనే మూడో సినిమా చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గోపీచంద్ హీరోగా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్ కి రాధాకృష్ణ కథ కూడా చెప్పడం జరిగిందంట.

అతనికి కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబందించిన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఫ్లాప్ సినిమాలు చేసే వెనుకబడిపోయిన దర్శకులకి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి గోపీచంద్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు ఉన్నాడు.