Begin typing your search above and press return to search.

భీమా.. గోపి ముందున్న అసలు లక్ష్యం ఇది!

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

By:  Tupaki Desk   |   5 March 2024 1:30 PM GMT
భీమా.. గోపి ముందున్న అసలు లక్ష్యం ఇది!
X

మ్యాచో స్టార్ గోపీచంద్ యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఒక సినిమాని కచ్చితంగా గోపీచంద్ ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నాడు. అయితే ఆయన చివరిగా కమర్షియల్ హిట్ అందుకున్న మూవీ లౌక్యం. ఈ మూవీ 2014లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ చిత్రం తర్వాత ఏకంగా 10 సినిమాలు చేశాడు. వాటిలో జిల్, గౌతమ్ నందా, సిటీమార్ సినిమాలు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. మిగిలినవన్నీ డిజాస్టర్ అయ్యాయి. గోపీచంద్ నుంచి చివరిగా వచ్చిన రామబాణం మూవీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం గోపీచంద్ భీమా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మూవీపైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏ హర్ష ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. కచ్చితంగా ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో గోపీచంద్ కి భీమా కమర్షియల్ సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నారు.

శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. మైథాలజీ మిస్టరీకి యాక్షన్ జోడించి భీమా చిత్రాన్ని హర్ష సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇలాంటి కథలకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భీమా హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ ఈ సినిమాతో సక్సెస్ కొడితే గోపీచంద్ ఖాతాలో పదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ పడినట్లు అవుతుంది.

సాలిడ్ కంబ్యాక్ గా మారుతుంది. అలాగే ఈ ఏడాదిలో టాలీవుడ్ కి ఒక్క హనుమాన్ రూపంలో మాత్రం సూపర్ హిట్ వచ్చింది. మళ్ళీ భీమా సినిమా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కించినట్లు అవుతుంది. భీమా సినిమాతో ఈ రెండు సాధ్యమవుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అలాగే గోపీచంద్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.