Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు భలే మంచి ఛాన్స్..!

అతను తెలుగులో చేసిన మొదటి సినిమాగా భీమా వస్తుంది. గోపీచంద్ కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది

By:  Tupaki Desk   |   4 March 2024 11:30 AM GMT
ఆ సినిమాకు భలే మంచి ఛాన్స్..!
X

మ్యాచో హీరో గోపీచంద్ ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ ఫుల్ లెంగ్త్ మాస్ సినిమాతో వస్తున్నాడు. ఈసారి పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో హిట్ టార్గెట్ తోనే గోపీచంద్ వస్తున్నాడని తెలుస్తుంది. కన్నడ స్టార్ డైరెక్టర్ హర్షతో గోపీచంద్ కలిసి చేసిన భీమా శివరాత్రి కానుకగా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూస్తే గోపీచంద్ మాస్ పొటెన్షియల్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని అనిపిస్తుంది. ఆల్రెడీ కన్నడలో మాస్ సినిమాలతో హర్ష తన మార్క్ చూపించాడు.

అతను తెలుగులో చేసిన మొదటి సినిమాగా భీమా వస్తుంది. గోపీచంద్ కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ కటౌట్ కి తగిన సినిమా పడితే పక్కా హిట్ పడుతుంది. భీమా అలాంటి సినిమానే అంటూ చెబుతున్నారు. ట్రైలర్ అప్పీల్ చూస్తే మాస్ ఆడియన్స్ కు పక్కా ఫీస్ట్ అందించేలా ఉందని తెలుస్తుంది. గోపీచంద్ తిరిగి ఫాం లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను హిట్ట్ కొడితే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. అతని మాస్ ఇమేజ్ కి తగిన మంచి కథ పడితే హిట్టు పక్కా వస్తుంది. భీమా సినిమా అలాంటి పకడ్బందీ కథతోనే వస్తుందని టాక్. ఎలాగు పోటీగా సినిమాలు ఏమి లేవు. విశ్వక్ సేన్ గామి సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా అనిపిస్తుంది. ఆ సినిమా సక్సెస్ అయినా భీమా మాత్రం మాస్ మూవీ కాబట్టి ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది.

గోపీచంద్ భీమా కి ఇది మంచి అవకాశం. మరి ఈ సినిమాతో మ్యాచో హీరో తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. గోపీచంద్ మాత్రం భీమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మళ్లీ ఈ హీరోకి యజ్ఞం, రణం లాంటి రోజులు తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ సినిమా పక్కా మీ అందరినీ అలరిస్తుందని గట్టిగా చెప్పాడు. మరి భీమా రీ సౌండ్ ఎలా ఉంటుందో చూడాలి.