Begin typing your search above and press return to search.

గోపీచంద్ కు కూడా రవితేజ లాంటి చిక్కే..

కానీ ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు గోపీచంద్.

By:  Tupaki Desk   |   7 March 2024 9:15 AM GMT
గోపీచంద్ కు కూడా రవితేజ లాంటి చిక్కే..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న సరైన హిట్లు అందుకోలేక సతమవుతున్న హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లను సాధించిన ఈ హీరో.. గతకొన్నేళ్లుగా సరైన సక్సెస్ ను దక్కించుకోలేకపోయారు. కానీ ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు గోపీచంద్. ఆయన నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా రిలీజ్ కు సిద్ధమైంది.

పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్లు జోడించి భీమా మూవీని హర్ష తెరకెక్కించారు. ఈ పక్కా కమర్షియల్ సినిమా.. శివరాత్రి పండుగ కానుకగా మార్చి 8వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికీ మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మంచి రేట్ కు అమ్ముడుపోయాయని సమాచారం.

అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయంలో పెద్ద సమస్యే వచ్చి పడినట్లు తెలుస్తోంది. నార్మల్ గా గోపీచంద్ మూవీల విషయంలో నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి ధరకే అమ్ముడవుతాయి. కానీ భీమా సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ మూవీ ఓటీటీ హక్కులను షేర్ పద్ధతిలో ఇచ్చేశారని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓటీటీలో ఎంత‌ మంది ఈ మూవీని చూస్తే.. అన్ని డ‌బ్బుల‌న్న‌మాట‌.

సాధార‌ణంగా చిన్న సినిమాల్ని ఇలాంటి షేర్ పద్ధతిలో ఓటీటీ సంస్థ‌లు తీసుకొంటుంటాయి. ఇప్పుడు మీడియం రేంజ్ హీరో గోపీచంద్ మూవీని ఇలా తీసుకోవడం గమనార్హం. అయితే గత కొన్ని నెలలుగా గోపీచంద్ సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కారణమని సమాచారం. అయితే ఇటీవల రిలీజ్ అయిన రవితేజ ఈగల్ మూవీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. షేరింగ్ పద్ధతిలో రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యింది ఈ సినిమా. మొత్తానికి ఈ రెండు మూవీల ఓటీటీ హక్కుల విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు, భీమా మూవీపై గోపీచంద్.. చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎలా అయినా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. హర్ష తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌ పై కేకే రాధామోహన్ నిర్మించారు. గోపీచంద్ సరసన ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముకేష్ తివారీ, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.