Begin typing your search above and press return to search.

స‌లార్ -2 లో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు!

`స‌లార్` ఏ రేంజ్ హిట్ అందుకుందో తెలిసిందే. వ‌రుస ప్లాప్ ల‌తో ఉన్న డార్లింగ్ ప్ర‌భాస్ కి `స‌లార్` రూపంలో సాలిడ్ హిట్ ప‌డింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:30 AM GMT
స‌లార్ -2 లో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు!
X

`స‌లార్` ఏ రేంజ్ హిట్ అందుకుందో తెలిసిందే. వ‌రుస ప్లాప్ ల‌తో ఉన్న డార్లింగ్ ప్ర‌భాస్ కి `స‌లార్` రూపంలో సాలిడ్ హిట్ ప‌డింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల‌కు బిగ్ ట్రీట్ లా నిలిచింది. సీజ్ ఫైర్ టార్గెట్ 1000 కోట్లు పెట్టుకున్నా 700 కోట్ల వ‌సూళ్ల‌తో స‌త్తా చాటింది. ఇక `స‌లార్ -2` ఇంకా బాగుంటుం ద‌ని..అస‌లైన ఆర్మీ అందులో ఉంటుంద‌ని డార్లింగ్ ఇప్ప‌టికే హింట్ ఇచ్చేసాడు.


బ్యాక్ టూ బ్యాక్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో థియేట‌ర్లు మోతెక్కిపోవ‌డం ఖాయం. మ‌రి ఇలాంటి ప్ర‌తిష్టా త్మ‌క ప్రాజెక్ట్ లో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు కూడా తోడైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కిక్కే..మ‌జా వేరుగా ఉంటుంది అని చెప్పాలా? మ‌రి అందుకు ప్ర‌శాంత్ నీల్ రంగం సిద్దం చేస్తున్నాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

క‌థ‌లో అవ‌స‌ర‌మైన మార్పులు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. సినిమాలో ఓ కీల‌క మైన పాత్ర‌లో ప్ర‌భాస్ స్నేహితుడు మ్యాచో స్టార్ గోపీచంద్ ని కూడా తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. అయితే ఎలాంటి పాత్ర కి తీసుకుంటున్నారు. పాత్ర స్వ‌భావం ఏంటి? అన్నది క్లారిటీ లేదుగానీ గోపీచంద్ తో ఓ పాత్ర చేయించాలి అన్న ఐడియా మాత్రం డార్లింగ్ ఇచ్చిన‌ట్లే వినిపిస్తుంది. స‌ల‌హా బాగానే ఉంది. అందుకు గోపీ చంద్ కూడా ఒప్పుకోవాలి. ఇద్ద‌రు ఎలాంటి స్నేహితులు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు రాక ముందు నుంచే స్నేహితులు.

ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఎంట్రీ ఒకేసారి జ‌రిగింది. ఒక‌రు హీరో అయితే మ‌రోక‌రు విల‌న్ అయ్యారు. అదే `వ‌ర్షం` చిత్రంలో. ఆసినిమా అప్ప‌ట్లో ఎంత గొప్ప విజ‌యం సాధించిందో తెలిసిందే. త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. తాజాగా ప్ర‌భాస్ ప్ర‌పోజ‌ల్ తో గోపీచంద్ పేరు తెర‌పైకి వ‌స్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ గోపీచంద్ పాన్ ఇండియా సినిమా చేయ‌లేదు. రీజ‌న‌ల్ మార్కెట్ లోనూ ఆయ‌న డిమాండ్ వీక్ గానే ఉంది. ఈ నేప‌థ్యంలో స్నేహితుడిని లేప‌డం కోసం డార్లింగ్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది గెస్ చేయ‌లేనిదే.