Begin typing your search above and press return to search.

గోపిచంద్.. ఈసారి గట్టిగానే..

యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని గోపీచంద్ సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 10:30 AM GMT
గోపిచంద్.. ఈసారి గట్టిగానే..
X

యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని గోపీచంద్ సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా గోపీచంద్ కి సరైన సక్సెస్ పడలేదు. మంచి కంటెంట్ తో మూవీ పడితే ఈపాటికే స్టార్ హీరోల జాబితాలో ఉండాల్సిన నటుడు గోపీచంద్. అయితే అతని కథల ఎంపికలో లోపమో లేదంటే ఇంకే కారణమో గాని స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోతున్నాడు. ఇప్పటికి కూడా గోపీచంద్ ఫేట్ మారిపోవడానికి ఒక్క సినిమా చాలు.

అలాగే అతని మార్కెట్ అమాంతం పెరిగిపోవడానికి గ్రాండియర్ గా పవర్ ఫుల్ కథతో వచ్చే ఒక మూవీ చాలు అని చాలా మంది నమ్ముతారు. ప్రస్తుతం గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్షతో భీమా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న కథ కావడంతో కచ్చితంగా హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు. దీని తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక మూవీ ఉండబోతోంది.

ఈ రెండుంటి తర్వాత గోపీచంద్ ఓ భారీ సినిమాని చేయబోతున్నాడంట. అది కూడా యూవీ క్రియేషన్స్ లో. చాలా కాలంగా యూవీ నిర్మాతలు గోపీచంద్ తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే మంచి కథ దొరికితే చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి కథని యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పాడంట. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కి భారీ డిజాస్టర్ ని రాధాకృష్ణ ఇచ్చాడు.

అంతకంటే ముందు గోపీచంద్ కి జిల్ మూవీతో రాధాకృష్ణ హిట్ ఇచ్చాడు. ఆ సినిమాలో కంప్లీట్ మేకోవర్ తో గోపీచంద్ ని చాలా కొత్తగా రాధాకృష్ణ రిప్రజెంట్ చేశాడు. ఆడియన్స్ కి ఆ లుక్ బాగా నచ్చింది. అందుకే స్టైలిష్ డైరెక్టర్ అని రాధాకృష్ణ పేరు తెచ్చుకున్నాడు. యూవీ క్రియేషన్స్ లో రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన కూడా రాధాకృష్ణ టాలెంట్ మీద నిర్మాతలకి స్ట్రాంగ్ నమ్మకం ఉందంట.

అందుకే రీసెంట్ గా సుమారు 300 కోట్ల బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ కథని గోపీచంద్ ని దృష్టిలో ఉంచుకొని వారికి వినిపించారంట. కథ నచ్చడంతో నిర్మాతలు ఒకే చెప్పేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ కి ఆ స్థాయిలో మార్కెట్ లేకపోయిన కంటెంట్ లో దమ్ముంది కాబట్టి పాన్ ఇండియా లెవల్ లో భారీ కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన ఎనౌన్సమెంట్ ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.