Begin typing your search above and press return to search.

గోపీచంద్ - విజయ్ కాంబో.. ఇది సంగతి!

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 May 2025 6:00 PM IST
గోపీచంద్ - విజయ్ కాంబో.. ఇది సంగతి!
X

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ తో మాస్ యాక్షన్ జోనర్ లో ఆయన చేసిన జాట్ మూవీ మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి అలరించింది. అదే సమయంలో గోపీచంద్ ప్రశంసలు కూడా అందుకున్నారు.

అయితే జాట్ రిలీజ్ అయ్యాక ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు గోపీచంద్. ఆ సమయంలో తన సినిమాల కోసం మాట్లాడారు. అప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో మూవీ మిస్ అయిందని చెప్పారు. బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేశాక తాను విజయ్ తో సినిమా చేసేందుకు ట్రై చేశానని తెలిపారు గోపీచంద్ మలినేని.

నిజానికి.. తాను మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేస్తానని వార్తలు వచ్చాయని, కానీ విజయ్ కు స్టోరీ చెప్పానని తెలిపారు. దిల్ రాజు సమక్షంలో స్టోరీ చెప్పగా.. సింగిల్ సిట్టింగ్ లో కథ విని స్క్రిప్ట్ ఓకే చేశారని వెల్లడించారు. కానీ అప్పుడే పొలిటికల్ ఎంట్రీకి విజయ్ సిద్ధమవుతున్నారని, తనతో సినిమా వద్దని కొందరు చెప్పినట్లు తెలిసిందని అన్నారు.

దీంతో ఆ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. విజయ్ అనవసరంగా గోపీచంద్ మలినేని మూవీని మిస్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు. మంచి ఛాన్స్ వదులుకున్నారని కామెంట్లు పెడుతున్నారు. ది గోట్ వంటి సినిమాల కన్నా బదులు.. గోపీచంద్ తో చేతులు కలిపి ఉంటే బాగుండేదని చెబుతున్నారు.

ఎందుకంటే సరైన మాస్ అవతార్ లో ఆయన చూపించేవారని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి అది నిజమేనని చెప్పాలి. మాస్ యాక్షన్ సినిమాలకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. కనీసం జన నాయగన్‌కు బదులుగా తన చివరి చిత్రానికి గోపీచంద్‌ ను ఎంచుకుని ఉండాల్సిందని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సన్నీ డియోల్ కే మంచి హిట్ అందించిన గోపీచంద్.. విజయ్ అయ్యి ఉంటే ఇంకా అదరగొట్టి ఉండేవారని చెబుతున్నారు. అదే సమయంలో టాలీవుడ్.. కోలీవుడ్.. అంటూ ప్రాంతీయ అహంకారాలను పక్కన పెట్టాలని, బలమైన కథలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అది ఎవరైనా.. ఎక్కడైనా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏదేమైనా మలినేనిని అనవసరంగా విజయ్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి.