Begin typing your search above and press return to search.

గూగుల్ జాబితాలో టాప్ -10లో రెండు మ‌న హీరోవే!

ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో భాష‌ల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అవి వివిధ భాష‌ల్లో అనువాద‌ము అవుతుంటాయి

By:  Tupaki Desk   |   14 Dec 2023 8:30 AM GMT
గూగుల్ జాబితాలో టాప్ -10లో రెండు మ‌న హీరోవే!
X

ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో భాష‌ల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అవి వివిధ భాష‌ల్లో అనువాద‌ము అవుతుంటాయి. వాటిలో టాప్ -10 చిత్రాలు ఎంపిక చేయ‌డం అంటే? ఆషామాషీ కాదు క‌దా. ఎన్ని విష‌యా లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి..వాటిపై ఎంత విశ్లేష‌ణ చేయాలి. ఎక్క‌డ త‌ప్ప‌దిం చోటు చేసుకున్నా! సంస్థ‌కే చెడ్డ‌పేరు. ఇలా విష‌యాలతో కూడిన వ్య‌వ‌హ‌రం ఇదంతా. తాజాగా 2023 ఏడాకిగాను ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ -10 చిత్రాల జాబితాను గూగుల్ ప్ర‌క‌టించింది.

ఈ జాబితాలో మొత్తం 3 భార‌తీయ చిత్రాలు గుగూల్ లిస్ట్ లో ఉండ‌టం విశేషం. అందులో రెండు బాలీవుడ న‌టుడు షారుక్ ఖాన్ నటించిన సినిమాలున్నాయి. ట్రెడింగ్ మూవీ లిస్ట్ లో షారుక్ ఖాన్ న‌టించిన 'జ‌వాన్' మూడ‌వ స్థానంలో ఉండ‌గా ..'ప‌ఠాన్' ప‌ద‌వ స్థానంలో నిలిచింది. ఇక ఎనిమిద స్థానాన్ని 'గ‌ద‌ర్ -'2 ద‌క్కించుకుంది. ఈ మూడు సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

'జ‌వాన్'..'ప‌ఠాన్' రెండు చిత్రాలు క‌లిపి 2000 కోట్ల‌కు పైగావ‌సూళ్ల‌ని సాధించాయి. ఇక 'గ‌ద‌ర్-2' 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. వీటికి డిజిట‌ల్ మాధ్య‌మాల్లోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ చిత్రాల జాబితాలో 'జ‌వాన్'..'గ‌ద‌ర్-2'..'ఓపెన్ హైమ‌ర్'.. 'ఆదిపు రుష్ '..'పఠాన్' సినిమాలు వ‌రుస‌గా టాప్ 5 లో నిలిచాయి. 'కేర‌ళ స్టోరీ' ..'జైల‌ర్' ..'లియో' ..'టైగ‌ర్-3' ..'వారుసు డు' సినిమాలు టాప్ 10లో నిల‌వ‌డం విశేషం. వ‌ర‌ల్డ్ వైడ్ చూసుకుంటే మొద‌టి స్థానంలో 'బార్బీ' నిలిచింది.

రెండ‌వ స్థానంలో 'ఓపెన్ హైమ‌ర్' నిలిచింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ భారీ అంచ‌నా ల‌మ‌ధ్య రిలీజ్ అయిన జేమ్స్ కామోరూన్ విజువ‌ల్ వండ‌ర్' అవ‌తార్-ది వేఆఫ్ వాట‌ర్' కి టాప్ 5 లో స్థానం ద‌క్క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈసినిమా టాప్ 6 లో నిలిచింది. అవ‌తార్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. కానీ గుగూల్ జాబితాలో మాత్రం అవ‌తార్ టాప్ 5 లో లేక‌పోవ‌డం అభిమానుల్ని ఆలోజింప‌చేస్తోంది.