Begin typing your search above and press return to search.

పెదకాపుకి మంచి అవకాశం..!

ఇక ఈరోజు రిలీజైన సినిమాలు ఇలా ఉంటే పెదకాపు 1 అంటూ శ్రీకాంత్ అడ్డాల సినిమా వస్తుంది. విరాట్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా చేశారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:44 PM GMT
పెదకాపుకి మంచి అవకాశం..!
X

బాక్సాఫీస్ రేసులో ప్రతి వారం సినిమాలు పోటీకి వస్తుంటాయి. స్టార్ సినిమాలు లేని టైం లో కొన్ని సినిమాలు వరుస రిలీజ్ కడతాయి. ఈ వీకెండ్ ఆడియన్స్ ని అలరించడానికి 3 సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. ఆల్రెడీ నేడు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా శుక్రవారం మరో సినిమా వస్తుంది. ఈరోజు రిలీజైన రామ్ స్కంద సినిమా, రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలు రెండు ప్రేక్షకుల నుంచి సూపర్ అనిపించుకోవడంలో విఫలమయ్యాయి.

చంద్రముఖి 2 మొదటి షో నుంచే నీరసమైన టాక్ సొంతం చేసుకుంది. చంద్రముఖి సినిమానే మళ్లీ అటు తిప్పి ఇటు తిప్పి తీశారని ప్రేక్షకులు చెబుతున్నారు. చంద్రముఖి 2 చూడాలనుకునే వారు పాత్ర చంద్రముఖి చూసేయండి అని అంటున్నారు. ఇక స్కంద సినిమా విషయానికి వస్తే బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ఎప్పుడు కథ, కథనాల్లో ఎమోషన్ కనెక్ట్ చేసే బోయపాటి ఈ స్కందలో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడని అంటున్నారు.

సినిమా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ తినిపించేలా ఉన్నా లాజిక్ లేని కథ కథనాలు కొంతమేర నిరాశ కలిగిస్తున్నాయి. చంద్రముఖి 2 మీద స్కందకు మిక్సెడ్ టాక్ నడుస్తుంది. ఇక ఈరోజు రిలీజైన సినిమాలు ఇలా ఉంటే పెదకాపు 1 అంటూ శ్రీకాంత్ అడ్డాల సినిమా వస్తుంది. విరాట్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా చేశారు.

సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. స్కంద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే పెదకాపు పరిస్థితి ఎలా ఉండేదో కానీ స్కందపై మిశ్రమ స్పందన కచ్చితంగా పెదకాపు కి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. పెదకాపు సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కథే. కానీ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను చాలా క్లవర్ గా రూపొందించారని తెలుస్తుంది. మరి పెదకాపు 1 మంచి అవకాశాన్ని వాడుకుంటాడా లేక వదులుకుంటాడా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

శ్రీకాంత్ అడ్డాల మాత్రం పెదకాపు మీద చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా పార్ట్ 1 సక్సెస్ అయితే రెండో భాగమే కాదు ఇంకా చాలా కథలు చెబుతానని అంటున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.