Begin typing your search above and press return to search.

గోల్డెన్ బ్యూటీ హార్స్ రైడింగ్.. స్టన్నింగ్ లుక్స్

సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి.

By:  Tupaki Desk   |   11 Feb 2024 10:26 AM GMT
గోల్డెన్ బ్యూటీ హార్స్ రైడింగ్.. స్టన్నింగ్ లుక్స్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సంయుక్తా మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది.


తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇటీవలే డెవిల్ మూవీతో అలరించింది సంయుక్త. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. అయితే కొన్ని నెలలుగా కొత్త చిత్రాలకు సంయుక్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. త్వరలోనే ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వాటికి స్పందించకపోయినా.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.


సంయుక్తా మీనన్.. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ తో స్వయంభు మూవీ చేస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌ డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరో నిఖిల్ గుర్ర‌పు స్వారీ నేర్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా సంయుక్త మీన‌న్ కూడా హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఈ విష‌యాన్ని చెబుతూ సోష‌ల్ మీడియాలో ఒక స్పెష‌ల్ పోస్ట్ పెట్టింది. గుర్రపు స్వారీ చేస్తున్న పిక్స్ ను షేర్ చేసింది.


"నా గురించి, నా జీవితం గురించి 2024 చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకోను. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటాను. ప్రస్తుతం నా నెక్ట్స్ మూవీ స్వయంభు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. నన్ను నమ్మండి.. ఈ ప్రయాణం కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది" అంటూ సంయుక్త రాసుకొచ్చింది.

స్వయంభు చిత్రాన్ని పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌ పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నిఖిల్ యుద్ధ వీరుడిగా సర్ప్రైజింగ్ లుక్‌ లో కనిపించనున్నారు. మరి ఈ మూవీతో సంయుక్త ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.