పిక్‌టాక్ : అందాల గోల్డెన్ మీనూ ని చూశారా!
ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో హర్యానా తరఫున ప్రాతినిధ్యం వహించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
By: Tupaki Desk | 8 April 2025 6:39 PM ISTఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో హర్యానా తరఫున ప్రాతినిధ్యం వహించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో 2021లో ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా నిరాశ పరచినా త్రివిక్రమ్ దృష్టిలో పడింది. ఆ సమయంలోనే మీనాక్షి చౌదరి నటన గురించి త్రివిక్రమ్ అభినందించాడు. అంతే కాకుండా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. కట్ చేస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో మీనాక్షి పరిస్థితి ఏంటో అందరికీ తెల్సిందే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో మీనాక్షి చౌదరి నిలిచింది.
ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ అమ్మడు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే అందంగా కనిపించడంతో స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాదిలో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మీనూ ఇదే ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో ఈమె సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తూ ఉంది. అందాల ఆరబోత ఫోటోలతో చూపు తిప్పనివ్వడం లేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా రెండున్నర మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మీనాక్షి చౌదరి రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి గోల్డెన్ కలర్ టాప్‌తో పాటు, బ్లాక్ కలర్ పాయింట్‌ను ధరించడంతో మెరిసి పోతుంది. టాప్ అందాలతో చూపు తిప్పుకోనివ్వని మీనాక్షి చౌదరి మరోసారి తన అందమైన ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఇంత అందంగా ఉన్న మీనాక్షి చౌదరికి టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలకు జోడీగా నటించేంత స్థాయి ఉంది అంటూ నెటిజన్స్, అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు.
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశంకు ప్రాతినిధ్యం వహించి రన్నరప్‌గా నిలిచింది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తర్వాత హిట్ : ది సెకండ్ కేసలో నటించి హిట్‌ను సొంతం చేసుకుంది. గత ఏడాది ఈమె లక్కీ భాస్కర్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాదిలోనే ఈమె నటించిన గుంటూరు కారం, మెకానిక్ రాకీ, మట్కా ఒక హిందీ సినిమా, ఒక తమిళ్ సినిమా వచ్చింది. తెలుగులో ఈమెకు వచ్చిన గుర్తింపు ఇతర భాషల్లో దక్కలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ ఉంది. కనుక కచ్చితంగా ఏదో ఒక పాన్ ఇండియా సినిమాతో దేశవ్యాప్తంగా ఈ అమ్మడు పాపులారిటీని సొంతం చేసుకోవడం ఖాయం.
