Begin typing your search above and press return to search.

విశ్వక్ GOG.. అప్పుడే సీక్వెల్ కూడా!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్కో మెట్టు ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 11:16 AM GMT
విశ్వక్ GOG.. అప్పుడే సీక్వెల్ కూడా!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్కో మెట్టు ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకుపోతున్నారు. వరుస చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఇటీవల మార్చిలో ప్రయోగాత్మక చిత్రం గామితో మంచి హిట్ కొట్టిన విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వేసవి కానుకగా త్వరలో విడుదల కానుందీ సినిమా.

ఇప్పుడు మే17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి జిల్లాలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గొడవల చుట్టూ ఈ మూవీ తిరుగుతోంది. ఈ విషయం రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. మాస్ గెటప్ లో విశ్వక్‍ సేన్ టీజర్ లో ఓ రేంజ్ లో అదరగొట్టేశారు.

ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని చెబుతున్నారంతా. గోదావరి యాసలో విశ్వక్ డైలాగులు అదిరిపోయాయని అంటున్నారు. రిపీట్ మోడ్ లో టీజర్ ను చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. అయితే నిన్న రాత్రి జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కీలక ప్రకటన చేసి విశ్వక్ సేన్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైమ్ లోనే సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కూడా సీక్వెల్ ఉంటుందా అని నాగవంశీని ఓ రిపోర్టర్ అడిగారు. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్ ఉంటుందని నిర్మాత తెలిపారు. దీంతో ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకుండానే.. సీక్వెల్ పై కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విశ్వక్ సరసన నేహా శెట్టి హీరోయిన్‍ గా నటించగా.. స్టార్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషించారు. హిందీ బిగ్ బాస్ సెన్సేషన్ అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.