Begin typing your search above and press return to search.

గాడ్జిల్లా X కాంగ్.. బాక్సాఫీస్ పరిస్థితేంటి?

ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 194 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు చేసిందంట.

By:  Tupaki Desk   |   1 April 2024 4:19 AM GMT
గాడ్జిల్లా X కాంగ్.. బాక్సాఫీస్ పరిస్థితేంటి?
X

హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ద న్యూ ఎంపైర్ మూవీ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇండియాలో కూడా భారీ స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మిక్సడ్ రివ్యూలు వచ్చాయి. అయిన కూడా కలెక్షన్స్ పరంగా సినిమా దుమ్ముదులుపుతుంది. ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 194 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు చేసిందంట.

2024లో సెవెంత్ హైయెస్ట్ కలెక్షన్స్ ఈ మూవీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే చేరుకుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగానే క్లిక్కయ్యాయి. ఈ కారణంగా మల్టీప్లెక్స్ లో సినిమా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇండియాలో కూడా మూవీ మొదటి రోజు 13.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 12.60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఆదివారం కూడా 13 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ అయినట్లు సమాచారం.

అంటే ఈ లెక్కన చూసుకుంటే ఇండియాలోనే ఇప్పటి వరకు 36+కోట్లకి గా వసూళ్లని కేవలం మూడు రోజుల్లోనే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 2 మూవీ సొంతం చేసుకోవడం విశేషం. దీనిని బట్టి భారత్ లో ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందో అంచనా వేయవచ్చు. ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. తమిళనాట ఈ చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండో రోజు 3.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ అయ్యిందని టాక్.

ఇక తమిళనాడు లో రెండు రోజుల్లోనే 7.50 కోట్ల వసూళ్లు చేయడం నిజంగా విశేషం అని చెప్పాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ పై టిల్లు స్క్వేర్ ఇంపాక్ట్ పడింది. దీంతో కేవలం రెండు రోజుల్లో 4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయ్యింది. ఇండియాలో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు రేసులో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడంతో లాంగ్ రన్ లో 100 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ సినిమాలు చూసుకుంటే అవతార్ 484 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ 373.05 కోట్లతో నెంబర్ 2 గా ఉంది. మూడో స్థానంలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 227.30 కోట్లతో నిలిచింది. ఈ కలెక్షన్స్ ని ఇప్పట్లో మరి ఏ హాలీవుడ్ సినిమా బీట్ చేయలేకపోవచ్చు.