Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: చింపాంజీ (Vs) ముగ్గురు అంద‌గ‌త్తెలు

ఈ చిత్రం అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్‌ను నమోదు చేసిన మహిళా ప్ర‌ధాన హిందీ చిత్రంగా రికార్డుల‌కెక్కింది.

By:  Tupaki Desk   |   31 March 2024 2:30 AM GMT
ట్రెండీ టాక్‌: చింపాంజీ (Vs) ముగ్గురు అంద‌గ‌త్తెలు
X

వారం వారం సినిమాలొస్తున్నాయి.. వెళుతున్నాయి.. కానీ ఈ వారం వ‌చ్చిన‌వి రెండూ క్రేజీ సినిమాలే.


కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్, టబు లాంటి అంద‌గ‌త్తెలు న‌టించిన‌ హీస్ట్ కామెడీ 'క్రూ' గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్‌ను నమోదు చేసిన మహిళా ప్ర‌ధాన హిందీ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ప్రపంచవ్యాప్త కలెక్షన్లలో ఈ చిత్రం రూ.అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల గ్రాస్ (10.30 కోట్ల నెట్) వ‌సూలు చేసింది.

అయితే ఈ సినిమాతో పోటీప‌డుతూ విడుద‌లైన హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వ‌ర్సెస్ కాంగ్ : ది న్యూ ఎంపైర్ ఇండియాలో బంప‌ర్ క‌లెక్ష‌న్లు సాధించింది. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద 15 కోట్ల నెట్ వ‌సూలు చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. హాలీవుడ్ అనువాద చిత్ర‌మే అయినా ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ద‌శ‌నుంచే ఆక‌ర్షించ‌డంతో ఆ మేర‌కు క‌లెక్ష‌న్లు పోటెత్తాయ‌ని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇటీవ‌లి కాలంలో చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కంటే ఈ రెండు సినిమాల ఓపెనింగులు చాలా ఎక్కువ అంటే అతిశ‌యోక్తి కాదు.

ముగ్గురు అంద‌గత్తెల‌తో రూపొందించిన క్రూ చిత్రం టీజ‌ర్ పోస్ట‌ర్ ద‌శ నుంచే ఎంతో క్యూరియాసిటీ పెంచింది. విమానంలో అంద‌గ‌త్తెల ఫ‌న్నీ దొంగ‌త‌నాలు, స్మ‌గ్లింగ్ వ్య‌వ‌హారాలు కుర్ర‌కారుకు పిచ్చిగా న‌చ్చేసాయి. స్మ‌గ్లింగ్ గూడ్స్ ను కొట్టేసే అంద‌మైన యువ‌తులుగా ట‌బు, క‌రీనా, కృతిల న‌ట‌న ఏ రేంజులో వ‌ర్క‌వుటైందో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా అద్భుత‌మైన ఓపెనింగును సాధించింది. ఇక కాంగ్ వ‌ర్సెస్ గాడ్జిల్లా సినిమాల‌కు ఎల్ల‌పుడూ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ముగిసే వేళ ఈ సినిమా థియేట‌ర్లు కిట‌కిట‌లాడేందుకు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.

ప్రారంభ రోజున సినిమా విజయగాథను పుర‌స్క‌రించుకుని సీనియ‌ర్ న‌టి కరీనా క‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ చేసింది: రియా- ఏక్తా.. నాతో రౌండ్ 2... వీరే ది వెడ్డింగ్‌తో మొదలై ఇప్పుడు CREWతో కొనసాగుతోంది కాబట్టి ఈ సుందరమైన మహిళలతో కలసి రావడం అదృష్టం. కృతిసనన్, టాబుటిఫుల్ & ది అమేజింగ్ రాజూస్ వ‌రల్డ్ అంటూ క‌రీనా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమా ఓపెనింగ్ డే సక్సెస్‌ను చారిత్రక విజ‌యం అంటూ కృతి స‌నోన్ అభివర్ణించారు.

ఏ హీరో లీడ్‌లో లేకపోవడంతో, ముగ్గురు బాలీవుడ్ లేడీస్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని డెలివరీ చేసే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ , అనిల్ కపూర్ ఫిల్మ్స్ & కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై ఏక్తా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.