Begin typing your search above and press return to search.

గాడ్జిల్లా (X) కాంగ్: మాన్‌స్ట‌ర్స్ ఢీ

ట్రైల‌ర్ ఆద్యంతం భారీ మాన్ స్ట‌ర్స్ ఆవిర్భావం.. వాటి మ‌నుగ‌డ‌, పోరాటాల‌ను ఆవిష్క‌రించింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:16 PM GMT
గాడ్జిల్లా (X) కాంగ్: మాన్‌స్ట‌ర్స్ ఢీ
X

సృష్టిలో అత్యంత భీక‌ర‌మైన బ‌ల‌మైన మాన్ స్ట‌ర్స్ గా ఇప్ప‌టికే గాడ్జిల్లా, కాంగ్ ల‌ను మ‌న ద‌ర్శ‌కులు వెండితెర‌పై ఆవిష్క‌రించారు. ఇలాంటి భీక‌ర‌మైన జంతువుల మ‌ధ్య పోరాటం తెరపై వీక్షించ‌డం ఒక‌ పెద్ద పండ‌గ లాంటిది. ఈ జాన‌ర్ సినిమాల‌కు పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేదు. అంద‌రినీ అల‌రించే కేట‌గిరీలోనే ఈ సినిమాలు ఉన్నాయి.

'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్` మొదటి ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ట్రైల‌ర్ ఆద్యంతం భారీ మాన్ స్ట‌ర్స్ ఆవిర్భావం.. వాటి మ‌నుగ‌డ‌, పోరాటాల‌ను ఆవిష్క‌రించింది. గాడ్జిల్లాతో మాన‌వాళికి పెను ముప్పు పొంచి ఉంది. అయితే మాన‌వుల‌తో స‌త్సంబంధాలు క‌లిగి ఉన్న కాంగ్ ఈ ముప్పును ఎలా ఆపింది? అన్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంటుంది. కొత్త ముప్పును ఎదుర్కొనే స‌మ‌యంలో మిత్రపక్షాలు ఒక‌ట‌య్యే స‌న్నివేశాన్ని కూడా ట్రైలర్ లో ఆవిష్క‌రించారు. భూమి ఉపరితలంపై మాత్రమే ఆ జీవి జీవించి ఉంటుంద‌ని భావిస్తున్నారా? అన్న వాయిస్ ఓవ‌ర్ తో ట్రైల‌ర్ పై ఉత్కంఠ పెరుగుతుంది. ప్రతి ఒక్కరి ఉనికిని బెదిరించే కొత్త జీవుల‌ సామ్రాజ్యం ఆవిర్భావం ఎలా జ‌రిగింది? అన్న‌ది వేచి చూడాలి. శక్తివంతమైన కాంగ్ ప్ర‌పంచానికి పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తోందా? గాడ్జిల్లాతో దాని పోరాటం ఎలా సాగింది? అన్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంటుంది.

ఇంత‌కుముందు గాడ్జిల్లా x కాంగ్ మునుప‌టి భాగాలు అభిమానుల‌ను గొప్ప‌గా అల‌రించాయి. స్కల్ ఐలాండ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. తాజా చిత్రంలోను స్క‌ల్ ఐలాండ్ రహస్యాల‌ను ప‌రిశోధించ‌డం కూడా క‌నిపిస్తుంది. కాంగ్ జాతితో మానవజాతి స్నేహం వ‌గైరా అంశాలు ర‌క్తి క‌ట్టించ‌నున్నాయి. చివ‌రికి మ‌నిషి చేప‌ట్టిన మిష‌న్ ఏమిట‌న్న‌ది కూడా ఆస‌క్తిని క‌లిగించే ఎలిమెంట్.

ట్రైల‌ర్‌లో భ‌గ‌భ‌గ మరిగిపోయే గాడ్జిల్లాతో కాంగ్ పోరాటం మ‌రో లెవ‌ల్లో ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ నటించారు. టెర్రీ రోసియో, సైమన్ బారెట్, జెరెమీ స్లేటర్ టోహో కో త‌దిత‌రులు గాడ్జిల్లా పాత్ర ఆధారంగా స్క్రీన్‌ప్లేను రాశారు.