Begin typing your search above and press return to search.

గాడ్స్ ఓన్ కంట్రీ లైకా ప్రొడక్షన్స్‌కు స్వాగతం

పృథ్వీరాజ్ దర్శకుడిగా తిరిగి కంబ్యాక్ అవుతున్నాడు. 'L2E: ఎంపురాన్' టైటిల్ తో మోహన్‌లాల్ -పృథ్వీరాజ్ మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:33 PM GMT
గాడ్స్ ఓన్ కంట్రీ లైకా ప్రొడక్షన్స్‌కు స్వాగతం
X

మలయాళ సినిమా తరచుగా మేధో సంపన్నమైన కథలకు కేంద్రంగా పరిగణించబడుతుంది. సంవత్సరాలుగా లోతైన ప‌రిజ్ఞానం పరిపక్వత కలిగిన చిత్రాలను నిరంతరం నిర్మించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఏమిటంటే మలయాళ చిత్రాలను అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా వాస్తవిక పద్ధతిలో స‌హ‌జ‌ నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎలివేట్ చేసిన ప్రతిభావంతులైన నటులు ఇక్క‌డ ఉండ‌ట‌మే...

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మలయాళ సినిమా అగ్ర‌నటుల్లో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో 350కి పైగా చిత్రాలతో మాస్‌లో తిరుగులేని హీరోగా నిలిచాడు. సీనియ‌ర్ న‌టుడి నటనా నైపుణ్యం.. ఎదురేలేని ఇమేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద హ‌వాకు కార‌ణ‌మైంది. నేటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఆయ‌న పేరు నిలుస్తోంది.

ఆస‌క్తిక‌రంగా లాల్ తో క‌లిసి ద‌ర్శ‌కుడిగా మారిన న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన 2019 సూపర్ హిట్ 'లూసిఫర్‌'కి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. పృథ్వీరాజ్ దర్శకుడిగా తిరిగి కంబ్యాక్ అవుతున్నాడు. 'L2E: ఎంపురాన్' టైటిల్ తో మోహన్‌లాల్ -పృథ్వీరాజ్ మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ఇద్ద‌రినీ మరోసారి కలిపే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆంటోనీ పెరుంబవూరు నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ భారీ పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తోంది. ఇప్పుడు G.K.M తమిళ కుమారన్ నేతృత్వంలో లైకా ప్రొడక్షన్స్‌తో ఆశీర్వాద్ సినిమాస్ చేతులు కలిపింది.

దేవుని స్వంత దేశం లైకా ప్రొడక్షన్స్‌ను హృదయపూర్వకంగా స్వాగతించింది. లైకా ఛైర్మన్, శ్రీ సుభాస్కరన్ ఈ క‌ల‌యిక‌పై స్పందించారు. లోతైన కథలు చెప్పడంలో నిబద్ధత సాంస్కృతికంగా గొప్ప భూమి అయిన కేరళ ప్రజల్లో బలంగా ప్రతిధ్వనిస్తుంది. 'L2E: ఎంపురాన్' తో మలయాళ చిత్రాలలో తొలి అవకాశంతో మేము ఆశీర్వదించబడ్డామ‌ని శుభాష్క‌ర‌న్ అన్నారు. ''మా క‌ల‌యిక‌లో పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా దాని కథనాలను ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ చిత్రం విజయం మునుముందు అనేక సంవత్సరాల పాటు పరిశ్రమ నుండి ప్రగతిశీల, ప్రభావవంతమైన సినిమాలకు మార్గనిర్దేశం చేసే లైకా స్థానాన్ని సుస్థిరం చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ ప్రతిష్టాత్మకమైన సహకార ప్రాజెక్ట్‌లో మాతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు'' అని ఆశీర్వాద్ సినిమాస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇద్ద‌రు లెజెండ్ లు క‌లిసి ఇప్పుడు లూసీఫ‌ర్ సీక్వెల్ (ఎల్2 ఇ) తో సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.