గోదావరి 2.. ఈ హింట్ ఇస్తే చాలు..!
టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరైన శేఖర్ కమ్ముల తను తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 21 May 2025 6:00 AM ISTటాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరైన శేఖర్ కమ్ముల తను తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. ఆనంద్ తో మొదలైన శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ లవ్ స్టోరీ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. తను తీసే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. అందుకే సినిమా సినిమాకు లేట్ అయినా ఆడియన్స్ అంచనాలకు తగిన సినిమాలే చేస్తుంటాడు.
ఐతే శేఖర్ కమ్ముల కెరీర్ మొదట్లో గోదావరి అనే సినిమా చేశాడు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2006 లో వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఐతే రీసెంట్ గా సుమంత్ కూడా గోదావరి 2 చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారని అందుకే శేఖర్ కమ్ములతో తాను టచ్ లో ఉంటానని చెప్పారు. నటుడిగా ఒక డైరెక్టర్ ని అవకాశాలు అడగడం లో తప్పులేదంటున్నారు సుమంత్.
శేఖర్ కమ్ముల తో తనకు ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తనని కలుస్తానని. ఇక రాజమౌళి గారి డైరెక్షన్ లో కూడా చేయాలని ఉందని అన్నారు సుమంత్. ఐతే శేఖర్ కమ్ముల తో సుమంత్ చేస్తే గోదావరి 2 చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. చాలామంది ఆడియన్స్ కూడా గోదావరి 2 గురించి తనను అడుగుతారని.. అది శేఖర్ కమ్ముల చేతుల్లోనే ఉంది తను చేస్తానంటే నేను రెడీ అంటున్నారు సుమంత్.
సో సుమంత్ ఈ హింట్ ఇచ్చారంటే తప్పకుండా టైం తీసుకున్నా కూడా గోదావరి 2 ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఐతే అక్కినేని ఫ్యామిలీ హీరో అయినా కూడా సపోర్టింగ్ రోల్స్ చేయడంలో తనకు ఎలాంటి మొహమాటం లేదని అంటున్నారు సుమంత్. సార్, సీతారామం సినిమాల్లో పాత్రలు నచ్చి చేశానని అన్నారు సుమంత్. అనగనగా అనే సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుమంత్. ఈటీవీ విన్ లో ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సుమంత్ శేఖర్ కమ్ముల కలిసి గోదావరి 2 సినిమా చేస్తే తప్పకుండా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
