Begin typing your search above and press return to search.

గోట్‌ : హీరో, విలన్ ఒక్కరే!

ఈ సినిమాలో విజయ్ డబుల్‌ రోల్‌ అనే విషయాన్ని ఇప్పటికే యూనిట్‌ సభ్యులు లీక్‌ చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 10:59 AM GMT
గోట్‌ : హీరో, విలన్ ఒక్కరే!
X

తమిళ సూపర్ స్టార్‌ విజయ్ లియో సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన రాజకీయ అరంగేట్రం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను స్పీడ్ గా పూర్తి చేసేందుకు విజయ్ రౌండ్ ది క్లాక్ వర్క్‌ చేస్తున్నాడట.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా 'గోట్‌'(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం) అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ డబుల్‌ రోల్‌ అనే విషయాన్ని ఇప్పటికే యూనిట్‌ సభ్యులు లీక్‌ చేశారు. ఒక పాత్ర యంగ్‌ లుక్ లో కనిపించనుండగా, మరో పాత్ర ఓల్డ్‌ లుక్ లో కనిపించబోతుంది.

విజయ్ రెండు పాత్రల్లో కూడా అద్భుతమైన నటన కనబర్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా యూనిట్‌ సభ్యుల నుంచి మరో ఆసక్తికర లీక్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి అంటే సినిమాలో ఓల్డ్‌ లుక్ లో కనిపించే విజయ్ సినిమాలో మెయిన్‌ విలన్ గా కనిపించబోతున్నారట.

చాలా అరుదుగా మాత్రమే హీరో మరియు విలన్ ఒక్కరే ఉంటారు. ఆ అరుదైన ఘటన గోల్‌ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో వెంకట్‌ ప్రభు రూపొందిస్తున్న గోట్ లో హీరో మరియు విలన్ ఇద్దరూ కూడా విజయ్ అని సమాచారం అందుతోంది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.