Begin typing your search above and press return to search.

గోవా IFFIలో టాలీవుడ్ నుంచి ఎవ‌రు?

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) గోవాలో 54వ ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. నవంబర్ 20న శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో స్టార్-స్టడెడ్ వేడుకతో 9 రోజుల గాలా ప్రారంభం అవుతుంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:28 PM GMT
గోవా IFFIలో టాలీవుడ్ నుంచి ఎవ‌రు?
X

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) గోవాలో 54వ ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. నవంబర్ 20న శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో స్టార్-స్టడెడ్ వేడుకతో 9 రోజుల గాలా ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్ కి 'ధక్ ధక్' బ్యూటీ మాధురీ దీక్షిత్ నీనే ప్రధాన నాయిక‌. స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇవ్వబోతున్నందున ప్రారంభ వేడుక బాలీవుడ్ ప్రేమికులకు ట్రీట్ అవుతుంది. ఈ ఈవెంట్ కోసం అతిథి జాబితాలో విజయ్ సేతుపతి, సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, సన్నీ డియోల్, కరణ్ జోహార్, శంతను మోయిత్రా, శ్రేయా ఘోషల్ మరియు సుఖ్వీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రెస్ నోట్ ప్రకారం.. అవార్డు గెలుచుకున్న బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ స్టువర్ట్ గాట్ రూపొందించిన థ్రిల్లర్ క్యాచింగ్ డస్ట్ గాలా ప్రారంభ చిత్రంగా ఎంపికైంది. ఫ్రెంచ్ దర్శకుడు నూరి బిల్గే సెలాన్ దర్శకత్వం వహించిన ఎబౌట్ డ్రై గ్రాసెస్ మిడ్ ఫెస్ట్ చిత్రం.. రాబర్ట్ కొలోడ్నీ దర్శకత్వం వహించిన ది ఫెదర్‌వెయిట్ 54వ IFFIకి ముగింపు చిత్రం.

ఫెస్టివల్‌లో ఉత్తమ వెబ్ సిరీస్ (OTT) అవార్డు కోసం ఐదుగురు సభ్యుల జ్యూరీకి ద‌ర్శ‌క‌నిర్మాత రాజ్‌కుమార్ హిరాణీ అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రారంభ కేటగిరీకి సంబంధించిన జ్యూరీ ప్యానెల్‌లో దివ్యా దత్తా, ప్రొసెన్‌జిత్ ఛటర్జీ , చిత్రనిర్మాతలు కృష్ణ డికె, ఉత్పల్ బోర్‌పుజారి ఉన్నారు. ఈసారి ఇఫీకి 15 OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి 10 భాషల్లో మొత్తం 32 ఎంట్రీలు ప్రారంభ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు ఎంపిక‌య్యాయి.

కొత్తగా ప్రవేశపెట్టిన OTT అవార్డుల గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, COVID-19 మహమ్మారి నుండి, OTT పరిశ్రమ భారతదేశంలో అభివృద్ధి చెందిందని.. భారతదేశంలో సృష్టించబడిన అసలైన కంటెంట్ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. ఈ రంగం డైనమిక్ ల్యాండ్‌స్కేప్‌కు ప్రతిస్పందనగా వృద్ధి వార్షికంగా 28 శాతంగా ఉంది. OTT ప్లాట్‌ఫారమ్‌లలో అత్యుత్తమ కంటెంట్ సృష్టికర్తలకు పుర‌స్కారాల‌తో సెల‌బ్రేట్ చేయ‌డానికి మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రవేశపెట్టింది.

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు - నిర్మాత మైఖేల్ డగ్లస్‌ను ప్రతిష్టాత్మక సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్‌టైమ్ అవార్డుతో సత్కరించనున్నారు. నవంబర్ 28న జరిగే ఐఎఫ్‌ఎఫ్‌ఐ మాస్టర్ క్లాస్‌లో కూడా ఆయ‌న‌ ప్రసంగించనున్నారు.

భారతీయ పనోరమాను భారతదేశం అంతటా ప్రముఖ చలనచిత్ర ప్రముఖుల జ్యూరీ ఎంపిక చేసింది. ఫీచర్ ఫిల్మ్స్ కోసం మొత్తం 12 మంది జ్యూరీ సభ్యులు, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల కోసం ఆరుగురు జ్యూరీ సభ్యులు, సంబంధిత అధ్యక్షుల నేతృత్వంలో ప‌ని చేస్తారు. 12 మంది సభ్యులతో కూడిన ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత టిఎస్ నాగభరణ అధ్యక్షత వహిస్తారు.

ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఆనంద్ ఎకర్షి చిత్రం ఆటం (మలయాళం)ను ఇండియన్ పనోరమా విభాగంలో ప్రారంభ చలన చిత్రంగా ఎంపిక చేసింది. ప్రముఖ డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు అరవింద్ సిన్హా ఆరుగురు సభ్యుల నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి అధ్యక్షత వహిస్తారు. ఇండియన్ పనోరమా విభాగం భారతదేశం నుండి 25 ఫీచర్ ఫిల్మ్‌లు.. 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను ప్రదర్శిస్తుంది. నాన్ ఫీచర్ విభాగంలో మణిపూర్‌కు చెందిన ఆండ్రో డ్రీమ్స్ కూడా ఉంది.

239 ఆధునిక భారతీయ నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల పూల్ నుండి, ఇండియన్ పనోరమా విభాగంలో స్క్రీనింగ్ కోసం 20 సినిమాల ప్యాకేజీ ఎంపిక అయింది. లఘు చిత్రాల సేకరణ యువ ఔత్సాహికుల‌ను అనుభవజ్ఞులైన ద‌ర్శ‌క‌నిర్మాతలు సాంకేతిక నిపుణుల‌తో క‌లిసేందుకు అరుదైన వేదిక ఇది. ఆధునిక భారతీయ విలువలను తెర‌ప‌ర‌చ‌డం, పరిశీలించడం, వినోదంగా మ‌ల‌చ‌డం వంటివి ప్ర‌తిభ‌కు తార్కాణంగా నిల‌వ‌నున్నాయి. 54వ IFFI నవంబర్ 28న ముగుస్తుంది. ఈసారి ఇఫీలో సంద‌డి చేయ‌నున్న టాలీవుడ్ స్టార్లు ఎవ‌రు అన్న వివ‌రాలు రావాల్సి ఉంది.