Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయి బికినీ డోస్.. మరింత ఘాటుగా..

గ్లామరస్ బ్యూటీగా ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న యువ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల. అమ్మడి పేరు చెబితే చాలా మంది అంతగా గుర్తుపట్టకపోవచ్చు

By:  Tupaki Desk   |   19 Feb 2024 5:11 PM GMT
తెలుగమ్మాయి బికినీ డోస్.. మరింత ఘాటుగా..
X

గ్లామరస్ బ్యూటీగా ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న యువ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల. అమ్మడి పేరు చెబితే చాలా మంది అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ, తెలుగు టెలివిజన్ వరల్డ్ లో ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యింది. యాంకర్ ప్రదీప్ పేరు చెబితే చాలా మందికి జ్ఞానేశ్వరి గుర్తుకు వస్తుంది. స్టార్ మాలో ఆ మధ్యలో పెళ్లి చూపులు అనే ప్రోగ్రాం ఈ కాంబో బాగా ట్రెండ్ అయ్యింది. ఈమె ఆ షోలో విజేతగా కూడా నిలిచింది.

అందమైన అమ్మాయిలతో పోటీ పడిన అమ్మడు ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది. అందులో యాంకర్ గా సుమ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఒకటే సీజన్ తో వచ్చిన వారు ఎక్కువ కాలం ఈ షోని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక ఆ షోకి వచ్చిన చాలా మంది అమ్మాయిలు టెలివిజన్ లో అలాగే సినిమాల్లో ఏదో ఒక విధంగా బిజీ అయ్యారు. ఇక గ్లామర్ సుందరి జ్ఞానేశ్వరి కూడా హీరోయిన్ గా రాణించాలని అనుకుంటోంది.

పెళ్లి చూపులు షో అనంతరం జ్ఞానేశ్వరి కి మాత్రం కొన్ని ఆఫర్లు రాగా బాగా ట్రెండ్ అయ్యింది. నీ జతగా, మిస్టర్ అండ్ మిస్ వంటి సినిమాల్లో కూడా నటించింది. కొన్ని టెలివిజన్ షోలలో కూడా హైలెట్ అయ్యింది కానీ అనుకున్నంత గా గుర్తింపు రాలేదు. కానీ సినిమాల్లో మాత్రం బోల్డ్ సీన్స్ లోనూ లిప్ లాక్స్ లోనూ ఏ మాత్రం మొహమాటపడకుండా నటించి పెద్ద షాక్ ఇచ్చింది.

ఇక స్కిన్ షో తో కూడా అమ్మడు స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. అయితే గ్లామర్ డోస్ ఎంత పెంచినా కూడా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని అనుకుంది కానీ పెద్దగా ఇమేజ్ ని తీసుకురాలేదు. ఇక మళ్ళీ హఠాత్తుగా ఆమె ఎందుకో టెలివిజన్ వరల్డ్ లో కనిపించకుండా పోయింది. సినిమా అవకాశాలు కూడా పెద్దగా రాలేదు.

ఇక మళ్ళీ చాలా కాలం తరువాత అమ్మడు సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక బికినీ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. రీసెంట్ గ్రీన్ కలర్ బికినీలో కనిపించి స్టన్ అయ్యేలా చేసింది. బికినీలో ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బికినీలోనూ అమ్మడు క్లీవేజ్ అందాలు కనిపించేలా స్కిన్ షో చేసిన విధానం మరింత హైలెట్ అయ్యింది. మరి ఈ బికినీ షో అనంతరం అమ్మడికి ఇండస్ట్రీలో ఏవైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.