Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో పాప్ స్టార్ల‌ హంగామా

ఆడమ్ బ్లాక్‌స్టోన్ (ఆస్కార్ విజేత, పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్), J బ్రౌన్ (అమెరిక‌న్ సింగ‌ర్ , సాంగ్ రైట‌ర్) కూడా ఈ ఈవెంట్ కోసం వ‌చ్చిన వారిలో కనిపించారు

By:  Tupaki Desk   |   29 Feb 2024 7:54 AM GMT
అంబానీ పెళ్లిలో పాప్ స్టార్ల‌ హంగామా
X

ముఖేష్ అంబానీ వార‌సుడు అనంత్ అంబానీ పెళ్లి సంద‌డి అంబ‌రాన్నంటింది. దేశ‌, విదేశాల నుంచి ఈ పెళ్లికి టాప్ సెల‌బ్రిటీలు అటెండ‌వుతుండ‌డంతో స‌ర్వ‌త్రా అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. జామ్ న‌గ‌ర్ లో జామ్ జామ్ అంటూ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక వైభ‌వంగా జ‌రుగుతోంది. ప్రీ వెడ్డింగ్ కోసం పాప్ స్టార్ రిహన్న బృందం జామ్‌నగర్‌కు చేరుకుంది. ఆడమ్ బ్లాక్‌స్టోన్ (ఆస్కార్ విజేత, పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్), J బ్రౌన్ (అమెరిక‌న్ సింగ‌ర్ , సాంగ్ రైట‌ర్) కూడా ఈ ఈవెంట్ కోసం వ‌చ్చిన వారిలో కనిపించారు

ఈ సంవత్సరం అతిపెద్ద వివాహాలలో ఒకటిగా అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంటున్న అతిథులు, పెర్ఫామ‌ర్ల పేర్లు కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాయి. ప్రీవెడ్డింగ్ కి కేవలం ఒక రోజు మాత్రమే ఉండటంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, గ్లోబల్ స్టార్స్‌ సహా పలువురు అతిథులు ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రావడం ప్రారంభించారు. జామ్‌నగర్ విమానాశ్రయం స‌హా వెడ్డింగ్ వేదిక నుండి వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, మనీష్ మల్హోత్రా, మానుషీ చిల్లర్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ తారలు వివాహానికి ముందు వేడుకలకు వెళుతున్న ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

వీరితో పాటు అమెరికన్ సింగర్ జె బ్రౌన్ , ప్రముఖ రాపర్ నిక్కీ మినాజ్, సంగీత దర్శకుడు ఆడమ్ బ్లాక్‌స్టోన్ కూడా ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల‌ కోసం జామ్‌నగర్‌కు చేరుకున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి ఆడమ్ బ్లాక్‌స్టోన్ విమానాశ్రయం నుండి బయటకు వెళుతూ క‌నిపించాడు. అయితే బ్రౌన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు బీచ్ కార్గోలతో తెల్లటి హూడీని ధరించి నవ్వుతూ కనిపించాడు. రాప‌ర్ నిక్కీ ట్రెండీ దుస్తుల్లో క‌నిపించాడు. అంబానీ పెళ్లిలో ఆలియా- ర‌ణ‌బీర్ ప్ర‌ద‌ర్శ‌న కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం ఉంది.