పెద్ద బ్రాండ్ ఉన్న ఫ్యామిలీ హీరో చివరికలా అయ్యాడు!
అయితే పరాజయం తర్వాతే అసలు కథ మొదలైంది. గిరీష్ ప్రస్తుతం టిప్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా సేవలందిస్తున్నారు.
By: Tupaki Desk | 3 Jun 2025 9:00 AM ISTబాలీవుడ్ లో టి సిరీస్ బ్రాండ్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యువకుడు హీరో అవ్వాలని కలలు కన్నా కానీ, అతడు అనూహ్యంగా నటనను వదిలేసి బిజినెస్ లు చూడాల్సి వచ్చింది. కేవలం 2 సినిమాలలో నటించాక పరిశ్రమను విడిచిపెట్టాడు. ఈ రోజు అతడు రూ.10వేల కోట్ల నికర సంపదలు ఉన్న కంపెనీని నిర్వహిస్తున్నాడు.
టిప్స్ ఇండస్ట్రీస్ యజమాని, నిర్మాత కుమార్ తౌరాని కుమారుడు గిరీష్ కుమార్ తౌరాని 2013లో విడుదలైన `రామయ్య వస్తావయ్యా` చిత్రంతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయిక. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించింది. ఈ చిత్రం రూ.50 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు గిరీష్ కుమార్ తౌరాని తన రెండవ చిత్రంలో నటించాడు. ఈ సినిమాని కూడా తన తండ్రి కుమార్ తౌరాని నిర్మించారు. గిరీష్ రెండవ చిత్రం `లవుష్‌డా` 2016లో విడుదలైంది. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో అతడు నటనను వదిలేసి వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు.
అయితే పరాజయం తర్వాతే అసలు కథ మొదలైంది. గిరీష్ ప్రస్తుతం టిప్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ, సంగీత సంస్థలలో ఒకదానికి వారసుడిగా ఉన్నాడు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్, శ్రీరామ్ రాఘవన్ థ్రిల్లర్ `మెర్రీ క్రిస్మస్` వంటి చిత్రాల పంపిణీని నిర్వహించాడు. గిరీష్ ఇప్పుడు కెమెరా వెనుక నుండి పనిచేస్తున్నాడు. డిసెంబర్ 2024 నాటికి టిప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,517 కోట్లుగా ఉంది. అంత పెద్ద సంస్థను సజావుగా నడిపిస్తున్నాడు.
తన కెరీర్ రెండో చిత్రం లవ్‌షుడా(2016) విడుదల సమయంలో, గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు, ప్రస్తుత భార్య కృష్ణను వివాహం చేసుకున్నాడు. అయితే గిరీష్ ఏడాది పాటు వివాహాన్ని రహస్యంగా ఉంచాడు. 2017లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మాత్రమే దానిని వెల్లడించాడు. వివాహితుడు అనే ట్యాగ్ రొమాంటిక్ హీరోగా తన అవకాశాలను ప్రభావితం చేస్తుందని భావించి తన కెరీర్‌ను కాపాడుకోవడానికి తాను ఇలా చేశానని గిరీష్ పేర్కొన్నాడు.
