Begin typing your search above and press return to search.

ఝూమ‌ర్ ట్రైల‌ర్: ప్ర‌మాదంలో చేయిని కోల్పోయిన మ‌హిళా క్రికెట‌ర్ స్టోరి

ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో 'ఘూమర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:42 AM GMT
ఝూమ‌ర్ ట్రైల‌ర్: ప్ర‌మాదంలో చేయిని కోల్పోయిన మ‌హిళా క్రికెట‌ర్ స్టోరి
X

అభిషేక్ బచ్చన్ న‌టించిన 'ఘూమర్' ప్రీమియర్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం లో స‌యామీ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఆర్.బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా క‌థాంశం ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక‌ వికలాంగ మహిళ తన అడ్డంకుల ను అధిగమించి క్రికెట్ ప్లేయర్‌గా ఎలా విజయం సాధించింది? అన్న‌దే ఈ సినిమా. విక‌లాంగురాలి(స‌యామీ) విజ‌యానికి సహాయపడే క్రికెట్ కోచ్‌గా అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ల ను టీమిండియా క్రియేటర్స్ గతం లో విడుదల చేశారు. వాటికి వీక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో 'ఘూమర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. వెంటనే నటీనటులు సాంకేతిక నిపుణులు ఆన్‌లైన్‌లో షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది.

ట్రైల‌ర్ లో ఆరంభం మంచి క్రికెటర్‌ గా క‌నిపించిన సయామి అనూహ్యంగా ఒక పెను ప్రమాదానికి గుర‌వుతుంది. ఈ ప్ర‌మాదంలో ఆమె ఒక చేయిని కోల్పోతుంది. త‌న‌ ఆశయాలు చిన్నాభిన్నం అవుతాయి. తీవ్ర నిరాశ‌కు గురై డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయి ఆట‌ను విడిచిపెడుతుంది. అటు పై రంగం లోకి దిగిన కోచ్ అభిషేక్ బ‌చ్చ‌న్ ఆమెకు ఎలాంటి స‌హాయం చేశాడ‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

బ‌చ్చన్ ఒక క్రికెట్ కోచ్‌ని ఆమె మెంటర్‌గా చూడాలని త‌న‌కు నూరిపోస్తాడు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఒక కోచ్ ఒక చేతిని కోల్పోయిన యువ‌తి తన ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించి క్రికెట్ ప్రాక్టీస్ చేయడంలో ఆమెకు సహాయం చేస్తాడు. తద్వారా ఆ యువ‌తి క్రికెట్ ఆట‌ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం లో, షబానా అజ్మీ సయామి తల్లిగా నటించగా, అంగద్ బేడీ ప్రియుడిగా న‌టించాడు. మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్‌ ఎంతో ఆక‌ట్టుకుంది.

ఝూమ‌ర్ ట్రైల‌ర్ కు.. ఇందులో తార‌ల నటన కు ప్రేక్షకుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిషేక్ బచ్చన్‌కి మంచి స్క్రిప్ట్‌లు దొరకడం లేదు.. కానీ మంచి స్క్రిప్ట్‌లు అతనిని వెతుక్కుంటూ వస్తున్నాయి!! అంటూ ఒక‌రు స్పందించారు. ఇది బ్లాక్‌బస్టర్ అని ఒక అభిమాని ..గూస్‌బంప్స్ సాయియామీ! అని మరొకరు వ్యాఖ్యానించారు.

వికలాంగ అథ్లెట్ల విజయాల ను సెలబ్రేట్ చేసుకునే స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం అల‌రించ‌నుంది. అభిషేక్ -సయామితో పాటు, షబానా అజ్మీ- అంగద్ బేడీ కూడా ముఖ్యమైన పాత్రలు పోషంచ‌గా.. అమితాబ్ బచ్చన్, బిషన్ సింగ్ బేడీ ఇద్దరూ ఈ సినిమాలో అతిధి పాత్రలు పోషించారు. ఆగస్ట్ 18న సినిమా ప్రీమియర్ షోల కు రెడీ అవుతోంది. నుష్ర‌త్ భ‌రూచ్చా న‌టించిన అకెల్లి తో ఈ సినిమా పోటీప‌డ‌నుంది.