Begin typing your search above and press return to search.

జెంటిల్ మెన్ 2.. శంకర్ లేకుండా ఇలా..

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ జెంటిల్మన్

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:15 AM GMT
జెంటిల్ మెన్ 2.. శంకర్ లేకుండా ఇలా..
X

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ జెంటిల్మన్. ఆ సినిమా అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే శంకర్ ని కూడా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. జెంటిల్మన్ చిత్రాన్ని నిర్మించిన కె కుంజుమోన్ చాలా ఏళ్ల తర్వాత మరల జెంటిల్మన్ 2 మూవీ ఎనౌన్స్ చేశారు. 1999లో ఆయన నిర్మాతగా చివరి చిత్రం చేశారు. ఆ తరువాత ప్రొడక్షన్ హౌస్ ఆపేసారు.


అయితే మరల 24 ఏళ్ళ తర్వాత జెంటిల్మన్ 2 మూవీ చేయనున్నట్లు గతంలో ఎనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ కోసం కథ కూడా ఆయానే రాసుకున్నారు. స్టార్ టెక్నీషియన్స్ తోనే ఈ మూవీ ఉంటుందని కూడా నిర్మాత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా జెంటిల్మన్ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

అలాగే తమిళ్ స్టార్ లిరిక్ రైటర్ వైరముత్తు సాంగ్స్ రాస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా, అజయ్ విన్సెన్ట్ సినిమాటోగ్రాఫర్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆయా విభాగాలలో స్టార్స్ గా ఉన్నవారే కావడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ దర్శకుడు గతంలో ఆర్య, త్రిష జంటగా వచ్చిన సర్వం సినిమాకి రైటర్ గా వర్క్ చేశారు. నాని, వాణి కపూర్ నటించిన ఆహా కళ్యాణం సినిమాతో దర్శకుడిగా మారాడు.

2014లో ఆహా కళ్యాణం సినిమా వచ్చింది. మరల 9 ఏళ్ళ తర్వాత జెంటిల్మన్ 2 సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నది ఎవరు అనే విషయం ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో ఈ చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.

మరి భారీ బడ్జెట్ తో శంకర్ చేసిన జెంటిల్మెన్ కి సీక్వెల్ గా నిర్మాత ఎనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. టెక్నీషియన్స్ ఎంపికతోనే సినిమాపై కావాల్సినంత హైప్ క్రియేట్ చేశారు. మరి సరైన క్యాస్టింగ్ సెట్ అయితే కచ్చితంగా ఈ సీక్వెల్ మూవీ మంచి బజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.