Begin typing your search above and press return to search.

నిజమా.. జెనీలియా మళ్లీ తల్లి కాబోతోందా?

ఈ రోజుల్లో సెలబ్రెటీలు మూడో బిడ్డకు జన్మనివ్వడం అంటే అరుదైన విషయమే. దీంతో దీని మీద బీ-టౌన్లో పెద్ద డిస్కషన్ మొదలైంది

By:  Tupaki Desk   |   12 Sep 2023 10:24 AM GMT
నిజమా.. జెనీలియా మళ్లీ తల్లి కాబోతోందా?
X

ఫిలిం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం మీద జనాలకు ఉండే ఆసక్తే వేరు. సినిమాలు తగ్గించేసినా.. పూర్తిగా మానేసినా సరే.. వాళ్ల వ్యక్తిగత విషయాల మీద క్యూరియాసిటీ తగ్గదు. ఈ ఆసక్తిని గమనించే సెలబ్రెటీల గురించి సోషల్ మీడియా జనాలు రకరకాల వార్తలు పుట్టించేస్తుంటారు. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా.. మూడోసారి తల్లి కానుందనే న్యూస్ రెండు రోజులుగా వైరల్ అవుతోంది.

ఇప్పటికే జెనీలియా ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. వాళ్లిప్పుడు ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నారు. ఇంత గ్యాప్ తర్వాత జెనీలియా మళ్లీ తల్లి కాబోతోందనే వార్త అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇటీవల ఓ కార్యక్రమానికి జెనీలియా లూజ్ డ్రెస్ వేసుకుని రాగా.. అందులో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె బేబీ బంప్‌తో ఉందని, మరోసారి తల్లి కాబోతోందని వార్తలు పుట్టించి వైరల్ చేసేశారు.

ఈ రోజుల్లో సెలబ్రెటీలు మూడో బిడ్డకు జన్మనివ్వడం అంటే అరుదైన విషయమే. దీంతో దీని మీద బీ-టౌన్లో పెద్ద డిస్కషన్ మొదలైంది. ఐతే ఈ ఉత్సాహం మీద జెనీలియా భర్త రితీశ్ దేశ్‌ముఖ్ నీళ్లు చల్లేశాడు. తాము మరో బిడ్డకు జన్మనివ్వడం లేదని తేల్చేశాడు. నిజానికి తాను ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండటాన్ని ఇష్టపడతానని.. కానీ జెనీలియా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం నిజం కాదని అతను సోషల్ మీడియా అకౌంట్లో స్పష్టం చేశాడు.

పెళ్లి తర్వాత సినిమాలు మానేసి కొన్నేళ్లు పూర్తిగా వ్యక్తిగత జీవితానికే జెన్నీ పరిమితం అయింది. ఐతే పిల్లలు కాస్త పెద్ద వాళ్లయ్యాక ఆమె మళ్లీ ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టింది. తిరిగి సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది. మరాఠీలో తన భర్తతో కలిసి ఆమె చేసిన 'వేద్' బ్లాక్‌బస్టర్ అయింది. ఈ చిత్రం 'మజిలీ'కి రీమేక్ కావడం విశేషం. మరాఠీ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా 'వేద్' నిలవడం విశేషం.