జెనీలియా నేషనల్ పుట్ బాల్ ప్లేయర్!
13 ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ `జూనియర్` సినిమాతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జెనీలియా కీలక పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది.
By: Tupaki Desk | 27 July 2025 12:56 PM ISTఅందాల నటి జెనీలియా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. `సత్యం`తో పరిచయమైన అమ్మడు `సాంబ`, ` సై`, `నా అల్లుడు`, `హ్యాపీ`, `బొమ్మరిల్లు` లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అప్పటి యువతలో ఓ కలల రాణిగా వెలిగిపోయింది. ఈ సినిమాలన్నింటి కంటే ముందే `బోయ్స్` చిత్రంలో నటించింది. అటుపై బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది. రితీష్ దేశ్ ముఖ్ తో వివాహం తర్వాత సినిమాలంటే ఆసక్తి కూడా తగ్గించింది.
13 ఏళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ `జూనియర్` సినిమాతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జెనీలియా కీలక పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది. తెరపై కనిపించినంత సేపు సీరియస్ పాత్రలో ఎంగేజ్ చేసింది. కంబ్యాక్ పరంగా జెనీలియాకు మంచి రోల్ పడిందని చెప్పొచ్చు. మరి నటిగా కొనసా గుతుందా? లేదా? అన్నది అమ్మడి చేతుల్లోనే ఉంది. జెనీలియాకు మాత్రం టాలీవుడ్ మంచి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అక్క..వదిన పాత్రలకు జెనీలియా నవతరం హీరోల సినిమాల్లో పర్పెక్ట్ సూటవుతుంది.
స్టార్ హీరోల చిత్రాలకు పర్పెక్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. కానీ ఛాన్స్ తీసుకోవడమా? లేదా? అన్నది ఆమె చేతుల్లో పనే. ఆ సంగతి పక్కన బెడితే జెనీలియా మంచి పుట్ బాల్ ప్లేయర్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి పుట్ బాల్ ఆడే అలవాటు ఉంది. ఆ అలవాటు కేవలం టైంపాస్ గా మాత్రమే కాకుండా సీరియస్ ప్రయత్నాలు చేసి జాతీ య స్థాయిలో పుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగిందిట.
ఇంటర్మీడియట్ లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ లోకి వచ్చిందిట. ఆ తర్వాత నటిగా కెరీర్ అను కోకుం డానే మొదలైందని తెలిపింది. అలాగే జెనీలియా టాలీవుడ్ లో నటించిన మూడవ చిత్రం కూడా స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాతోనే తెరకెక్కింది. నితిన్ హీరోగా నటించిన `సై` చిత్రం లో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా రగ్బీ ఆట ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
