ఆడిషన్ ఇవ్వడానికి రెడీ..తరువాత మీ ఇష్టం అంటున్న జెనీలియా1
'బొమ్మరిల్లు' సినిమాతో 'హహా హాసిని' అంటూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి జెనీలియా.
By: Tupaki Desk | 14 July 2025 4:37 PM IST'బొమ్మరిల్లు' సినిమాతో 'హహా హాసిని' అంటూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి జెనీలియా. దాదాపు పదమూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా మళ్లీ వెండితెరపై కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రానా హీరోగా ప్రకాష్ తోలేటి డైరెక్ట్ చేసిన `నా ఇష్టం` తరువాత తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన జెనీలియా పదమూడేళ్ల విరామం తరువాత మళ్లీ తెలుగులో నటించడానికి రెడీ అయిపోయింది.
రీసెంట్‌గా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ నటించిన `సితారే జమీన్‌పర్`లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిసిన జెనీలియా అదే తరహా పాత్రల కోసం ఇప్పుడు అన్వేషణ మొదలు పెట్టింది. ఇందు కోసం ఆడిషన్‌కు కూడా తాను సిద్ధమేనంటూ సంకేతాల్ని అందిస్తోంది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న `జూనియర్`లో నటిస్తున్న జెనీలియా ఇకపై టైలర్ మేడ్ క్యారెక్టర్‌లకు మాత్రమే ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయించుకుందట.
అలాంటి పాత్రలకే ప్రాముఖ్యతనిస్తానని, వాటి ఎంపిక కోసం ఆడిషన్‌లకు కూడా తాసు సిద్ధమేనని డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెనీలియా పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. నేను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సీనియర్ నటిగా పేరు తెచ్చుకున్నాను. అలాంటి సీనియర్ నటిని అయిన నేను ఇప్పుడు ఆడిషన్‌లు ఇవ్వడం అవసరమా? అని కొంత మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను మాత్రం ఆడిషన్ ఇవ్వడం కరెక్టేనని భావిస్తున్నాను.
ఎందుకంటే ఆడిషన్ ఇవ్వడం వల్ల సరైన క్యారెక్టర్లని ఎంచుకోనే మార్గం సులువు అవుతుంది. తద్వారా బలమైన పాత్రలు పోషించే అవకాశం లభిస్తుంది. కాబట్టి మంచి క్యారెక్టర్ల కోసం ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పులేదని నాఫీలింగ్. ఈ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను` అని తెలిపింది. జెనీలియా సమాధాన్ని బట్టి ఆమెకు కళ పట్ల ఉన్న నిబద్ధత, ప్రేమ తెలుస్తోందని అంతా తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తను ఇలా నిర్ణయించుకుంది కాబట్టే రీఎంట్రీలో `సితార జమీన్‌పర్` వంటి సినిమాలని ఎంచుకుందని అంతా అంటున్నారు. జెనీలియా నటించిన `జూనియర్ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఇందులో తను కీలక పాత్రలో నటించింది. ఈ మూవీతో తనకు తెలుగులో భారీ ఆఫర్లు లభిస్తాయనే నమ్మకంతో ఉంది.
