అతనిలో దైవత్వం ఉంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 19 Jun 2025 12:00 AM ISTతెలుగులో ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది జెనీలియా. అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్న జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో ప్రతీ తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. ఆ సినిమాలో హాసినిగా జెనీలియా ఎంతగానో ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమిర్ ఖాన్ తో కలిసి సితారే జమీన్ పర్ లో కనిపించనుంది. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలిస్తున్న జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎన్టీఆర్ తో కలిసి రెండు సినిమాలు చేశానని, అతను చాలా అద్భుతమైన నటుడని, అతనిలో ఏదో తెలియని దైవత్వం ఉంటుందని జెనీలియా తెలిపింది.
ఎన్టీఆర్ కు మీరు మూడు పేజీల డైలాగ్ ఇచ్చినా, అతను దాన్ని చదివి తర్వాతి నిమిషంలో షాట్ కు వెళ్లగలడని, ఇక అతని డ్యాన్సింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని జెనీలియా తెలిపింది. కాగా జెనీలియా, ఎన్టీఆర్ కలిసి సాంబ, నా అల్లుడు సినిమాలు చేయగా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఊహించిన ఫలితాల్ని అందుకోలేకపోయాయి.
