అందుకే సినిమాలకు 13 ఏళ్లు దూరం: జెనీలియా
నేడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. తాను ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నాననో తెలిపారు జెనీలియా.
By: Tupaki Desk | 18 July 2025 12:27 PM ISTహీరోయిన్ జెనీలియాకు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో సందడి చేశారు. బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు అమ్మడు.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో బీటౌన్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్ గా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించి సందడి చేశారు.
జూన్ 20వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత జూనియర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ మూవీతో సందడి చేయనున్న ఆ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.
నేడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. తాను ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నాననో తెలిపారు జెనీలియా. పిల్లలు, భర్తతో బిజీగా ఉండటం వల్ల మూవీస్ లో నటించలేదని చెప్పిన ఆమె.. మీ (సుమ) లాగా తనకు బ్యాలెన్స్ చేయడం రాదని నవ్వుతూ అన్నారు. తాను ఈ గ్యాప్ లో ప్రొడ్యూసర్ గా మారానని వెల్లడించారు.
ఓ ఫుడ్ కంపెనీ కూడా స్టార్ట్ చేశానని, డిఫరెంట్ లైఫ్ అని తెలిపారు జెనీలియా. "జూనియర్ లో నాది ముఖ్యపాత్ర కాబట్టి ఆ సినిమాలో నటించాను. యాక్టర్ గా కష్టపడాలని ఉంటుంది. కానీ ఛాన్స్ రావాలి కదా. అప్పుడే ప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఆఫర్ చేశారు. నేను అందుకే 100 శాతం కష్టపడ్డా. కష్టపడాలి కూడా" అని చెప్పారు.
ఆ తర్వాత తన బొమ్మరిల్లు మూవీ కోసం మాట్లాడారు. ఆ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లోని పిక్ ను హోస్ట్ చూపించగా.. తాను బొమ్మరిల్లు సీక్వెల్ కోసం రెడీ అని తెలిపారు. బొమ్మరిల్లు రీ రిలీజ్ కు ఇక్కడ లేనని అన్నారు. కానీ తెలుసని అన్నారు. అయితే జూనియర్ సినిమాలో తనది స్పెషల్ రోల్ అని చెప్పారు. అందులో నటించడం అదృష్టమని వెల్లడించారు.
