Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. మరో హారర్ గేమ్

ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు అదే టీమ్ తో సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 10:35 AM GMT
ట్రైలర్ టాక్: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. మరో హారర్ గేమ్
X

హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ విడుదల చేయగా ఇప్పుడు మేకర్స్ ట్రైలర్‌ ను రిలీజ్ చేశారు. 2014 వచ్చిన గీతాంజలి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు అదే టీమ్ తో సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా సీన్స్ గురించి వివరిస్తూ ఉండగా భయానక ఇంట్లో ఊహించిని అలజడి క్రియేట్ అవుతుంది. ఇక కథానాయిక అంజలి తన పాత్రలో నిమగ్నమై షూటింగ్ చేస్తుండగా తోటి కమెడియన్స్ అల్లరి హైలెట్ గా నిలిచింది. సునీల్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు అర్ధమవుతుంది.

ఇక చివరికి షూటింగ్ కోసం వచ్చిన సిబ్బంది తమ సెట్, నిజానికి హాంటెడ్ హౌస్ అని గ్రహిస్తారు. ఇక దెయ్యాలు కూడా ఆర్టిస్టులుగా హైలెట్ అవుతూ కనిపించడం వాటితో కమెడియన్స్ వాదోపవాదాలు చేయడం మంచి ఫన్ ని జనరేట్ చేశాయి. సినిమా నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గా ఉండనున్నట్లు కొన్ని సీన్స్ తోనే క్లారిటీ ఇచ్చేశారు.

సునీల్ సినిమాటోగ్రాఫర్ పాత్రలో ఉండగా అంజలి, సత్యం రాజేష్, సత్య షూట్ లో ఆర్టిస్టులుగా కనిపించారు. వారి కామెడీ టైమింగ్, ముఖ్యంగా సత్య మార్క్ కు తగ్గ సన్నివేశాలతో పాటు ఇంటి చుట్టూ ఉన్న రహస్యం సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కథానాయిక అంజలి ద్విపాత్రాభినయంతో మరోసారి ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది.

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల కామెడీ హారర్ సినిమాలు వచ్చాయి. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది.. మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా ఈ సమ్మర్లో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ రాబోయే రోజుల్లో మరింత పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే విధంగా వరుస ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు.

ఎంవివి సినిమా & కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, జివి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సీక్వెల్‌కి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథ రాశారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.