Begin typing your search above and press return to search.

గీతాంజలి 2.. వచ్చేది ఎప్పుడంటే..

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో పాటూ యంగ్ హీరోలు సైతం సీక్వెల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు

By:  Tupaki Desk   |   26 Nov 2023 1:12 PM GMT
గీతాంజలి 2.. వచ్చేది ఎప్పుడంటే..
X

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో పాటూ యంగ్ హీరోలు సైతం సీక్వెల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హారర్ అండ్ కామెడీ జోనర్ లో వచ్చిన సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో వచ్చిన ఓ హారర్ కామెడీ మూవీకి త్వరలోనే సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ హారర్ కామెడీ మూవీ మరేదో కాదు 'గీతాంజలి'. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా 2014లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్, MVV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

గీతాంజలి తో మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీ టీం సీక్వెల్ తో మరో బ్లాక్ బస్టర్ డెలివర్ చేసేందుకు రెడీ అవుతుంది. గీతాంజలి మూవీకి పనిచేసిన సేమ్ టీం సీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మహదేవ్ తదితరులు ఈ సీక్వెల్ లో నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి కెరీర్ లో ఇది 50వ సినిమా కావడం విశేషం.

ఈ సీక్వెల్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ని పెడుతున్నారట. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఆరంభంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సీక్వెల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, ఊటీ వంటి ప్రదేశాల్లో ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. చివరి షెడ్యూల్ ని ఊటీ లో ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మలయాళ పాపులర్ యాక్టర్ రాహుల్ మహాదేవ్ ని ఈ సీక్వెల్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. శివ తుర్లపాటి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సీక్వెల్ని డైరెక్ట్ చేస్తుండగా MVV సినిమా, కోనా ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. సుహాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, కోన వెంకట్ కథ అందిస్తున్నారు.