Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: గీతాంజలి మళ్లీ భయపెడుతోందిగా!

ఈ నేపథ్యంలో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Feb 2024 6:17 AM GMT
టీజర్ టాక్: గీతాంజలి మళ్లీ భయపెడుతోందిగా!
X

నార్మల్ గా హారర్ జానర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మూవీ లవర్స్ ఎక్కువగా ఈ సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆడియెన్స్ ను భయపెడుతూనే హారర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకుంటున్న గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ మూవీ. అయితే ఈ సినిమా టీజర్ ను బేగంపేట స్మశాన వాటికలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో ఒక్కసారిగా సినీ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకుని దసపల్లా కన్వేషన్ సెంటర్‌ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. టీజర్ ను రిలీజ్ చేశారు.

అంజలి క్లాసికల్ డ్యాన్స్ తో టీజర్ మొదలైంది. ఎవర్రా వీళ్లు.. సంగీత్ మహల్ వైపు వెళ్తున్నారు.. ఆ మహల్ కోసం తెలిసే వెళ్తున్నారా? అని ఓ వ్యక్తి అడుగుతుండగా.. షూటింగ్ జరుగుతోంది అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్ వస్తాయి. ఆ తర్వాత సినిమా స్టోరీ చెబుతాడు శ్రీనివాస రెడ్డి. హీరోయిన్ అంజలి ట్విస్ట్ చెబుతుంది. ఇక టీజర్ ఒక్కసారిగా హారర్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దెయ్యాల గజ్జల సౌండ్ కు అందరూ భయపడతారు. ఒక్కొక్కరూ దెయ్యాలకు వణికిపోతారు. హారర్ తోపాటు కామెడీ కూడా టీజర్ లో కావాల్సినంత ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్. కొత్త గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని నెటిజన్లు అంటున్నారు. పెర్ఫెక్ట్ హారర్ జానర్ మూవీ అని చెబుతున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కొన్ని రోజుల క్రితం కోన వెంకట్ తెలిపారు.

హీరోయిన్ అంజలి కెరీర్ లో 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని శివ ద‌ర్శ‌క‌త్వం వహించారు. రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మార్చి 22వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమా గీతాంజలి లానే హిట్ అవుద్దో లేదో చూడాలి.